ఈటీవీ లో ప్రతి రోజు రాత్రి 8:00 గంటలకు యమలీల సీరియల్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో ప్రముఖ హాస్యనటుడు ఆలీ కూడా నటిస్తున్నాడు.. అందుకే ఈ సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిని ప్రేక్షకులలో రేకెత్తిస్తూ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది.. ఇకపోతే ఈ సీరియల్లో విలన్ పాత్రలో వజ్రావతి క్యారెక్టర్ లో సంధ్య నటిస్తూ అందరికీ చుక్కలు చూపిస్తోంది.. ఎత్తుకు పై ఎత్తులు.. విలన్ లక్షణాలు తన మోము లో చక్కగా చూపిస్తూ.. ప్రేక్షకులు కూడా తిట్టుకుంటున్నారు అంటే.. ఈమె తన పాత్రకు ఎంత న్యాయం చేస్తోందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..


ఇకపోతే వజ్రావతి అలియాస్ సంధ్య రియల్ లైఫ్ స్టోరీ గురించి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది..?ఆమె ఎవరు..? అనే విషయాలను తెలుసుకుందాం..


వజ్రావతి పూర్తి పేరు సంధ్య జాగర్లమూడి.. ఏప్రిల్ 15వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఈమె మద్రాసులో నివసిస్తున్నారు. ఇక ఈమెకు ఒక సోదరి కూడా ఉంది. సంధ్య జాగర్లమూడి విద్యాభ్యాసం విషయానికి వస్తే స్కూలింగ్ మొత్తం సెయింట్ జోసఫ్ హై స్కూల్ లో పూర్తికాగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. నటన మీద ఉన్న ఆసక్తే.. బుల్లితెరపై అడుగులు వేయడానికి నాంది పలికింది.. అలా మొదటి సారి తమిళ్ ఇండస్ట్రీ లో సీరియల్స్ లో నటిగా ప్రవేశించింది.

వరుసగా నాలుగైదు సీరియల్స్లో నటించిన సంధ్య తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ..ఈమెకు తమిళ సినిమాలలో అవకాశం కూడా లభించడంతో.. అక్కడ కూడా తన నటనతో తనదైన మార్కును వేసుకుంది. ఇక తెలుగు బుల్లితెర విషయానికి వస్తే ఈమె జెమినీ టీవీలో ప్రసారమైన అమ్మాయి కాపురం అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ్ లో చంద్రలేఖ అనే సీరియల్ తో పాటు తెలుగులో యమలీల సీరియల్ లో నెగిటివ్ రోల్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: