బిగ్ బాస్ సీజన్ మొదలయ్యి అపుడే అయిదు వారాలు గడిచింది. అంటే దగ్గర దగ్గర ఒకటిన్నర నెల కావొస్తోంది అన్న మాట. బుల్లి తెరపై బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది మొదలు ఇక అప్పటి నుండి ప్రేక్షకులకు ఓన్లీ హ్యాపీ ఫీలింగ్. ప్రతి ఇంట్లోనూ 10 అయింది అంటే ఇదే ఎంటర్టైన్మెంట్, అంతగా తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది ఈ రియాలిటీ షో. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టగా, ఇప్పటి వరకు మొత్తం ఐదు మంది ఎలిమినేట్ అయ్యారు. అందులో నలుగురు లేడీస్ కావడం గమనార్హం. సరయు, ఉమాదేవి, లహరి, ఉమాదేవి లు కాగా మేల్ కంటెస్టెంట్స్ లో నటరాజ్ మాస్టర్ మాత్రమే ఇంటి నుండి బయటకు వచ్చారు.

అయితే ఈసారి కూడా ఎలిమినేట్ అయ్యేది లేడీ కంటెస్టెంట్ అంటూ ప్రచారం జరుగుతోంది. అది ఎవరూ అనే విషయానికి వస్తే కానీ మాస్టర్ లేదా ప్రియా పేర్లు వినపడుతున్నాయి.  మొదటి రెండు మూడు వారాలు సిరి ఎలిమినేట్ అవబోతుంది అంటూ పేరు గట్టిగా వినిపించగా, ఇపుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్టులో చేరిపోయింది.  సిరికి  ముందు నుండే పాపులారిటీ ఉండటం కొంచం ప్లస్ అయితే..ఇపుడు బిగ్ బాస్ షో కి గ్లామర్ ప్లస్ గా ఉండటం హౌజ్ లో షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండటంతో సిరి క్రేజ్ బయట అలా అలా పెరిగిపోయింది. టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ అమ్మడు బయటకు రావడం లేటు వరుస అవకాశాలు చూస్తున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లను చూసుకుంటే ఎవ్వరికీ పెద్దగా అవకాశాలు వచ్చి బాగా సెటిల్ అయినట్లు దాఖలాలు లేవు.  కానీ ఈ బిగ్ బాస్ షో సిరి కెరియర్ కి స్పీడ్ పెంచేసిందంటు అంటున్నారు. ఇది నిజమవ్వాలని అంతా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: