ఈటీవీ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో మనసు మమతా సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికే మనసు మమత సీరియల్ లో ఎంతోమంది నటీనటులు మారినప్పటికీ కథ కథనం ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ ఈ సీరియల్కు అభిమానులు ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అంతలా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఏకైక సీరియల్ మనసు మమత అని చెప్పవచ్చు. చిన్నపిల్లాడిని మొదలు పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ సీరియల్ కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. ఈ సీరియల్ లో నటించిన మురళి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


మురళి అసలుపేరు అభిషేక్..అందరూ ముద్దుగా మురళిని నాని అని పిలుస్తారు. మనసు మమత సీరియల్ తో అందర్నీ మెప్పించిన మురళి..ఈ  సీరియల్ ముగియడంతో ప్రస్తుతం నా పేరు మీనాక్షి సీరియల్ లో ఒక పాత్రలో నటిస్తున్నాడు. మనసు మమత సీరియల్ తో ప్రేక్షకులని బాగా అలరించిన ఈయనకు వరుస ఆఫర్లు రావడంతో ఇప్పుడు నా పేరు మీనాక్షి సీరియల్ లో కూడా ఆఫర్ రావడంతో.. మురళి ని అందరూ బాగా అలరిస్తున్నారు. మురళి జూలై 31వ తేదీన జగ్గయ్యపేట లో జన్మించాడు.


మురళి పుట్టి పెరిగింది మాత్రం పల్లెటూర్లో అయినప్పటికీ  పెరిగింది విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే. అక్కడే సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలనే ఆలోచన పుట్టిందట మురళికి. అప్పటినుంచి నటన మీద ఆసక్తి కారణంగా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లలో నటించాడు. బాగా గుర్తింపు తెచ్చుకున్న మురళి ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్ లో నటించడానికి అవకాశం కొట్టేశాడు. బీటెక్ పూర్తి చేసిన మురళికి క్రికెట్ అంటే చాలా ఇష్టమట.. అంతే కాదు కాలేజీ డేస్ లో ఎన్నో ఈవెంట్స్ లో పాల్గొని అక్కడ ట్రోఫీ లు కూడా గెలుచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: