సినిమా ఇండస్ట్రీలో యాంకర్ రవి, అతని భార్య నిత్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. యాంకర్ రవి భార్య ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా టచ్ లోనే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తన కూతురు వియా ను చేసేటటువంటి వీడియోను, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. రవి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా వీటి ద్వారా పాపులర్ అయ్యారు. ఇక తన భార్య కూడా రవి.. తన ఇంట్లోనే లేనందువల్ల తన గురించి కొన్ని జ్ఞాపకాలు పంచుకుంటూ కాలం గడిపేది. వీటితో పాటుగా రవికి సంబంధించి కొన్ని విషయాలను కూడా తెలియజేస్తూ ఉండేది.


యాంకర్ రవి కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశారు. దాంతో తనకు ఎగైనెస్ట్ గా కామెంట్లు పెట్టడం, ట్రోల్స్ వంటివి చేయడం పై రవి తట్టుకోలేక వీటి పై కేసు నమోదు చేయాలని స్టేషన్ వరకు వెళ్లారు. ఇక తనకు జరిగిన అన్యాయం ఇంట్లో తెలియకుండా కామెంట్లు చేయడం సరి కాదని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా తన వైఫ్, పిల్లలపై కూడా చాలా అసభ్యంగా కామెంట్ చేశారు అని కన్నీరు పెట్టారు. వీటన్నిటిని రవి మనసులో పెట్టుకుని రంగంలోకి దిగారు. దీంతో వీరిద్దరూ కలిసి తమ ఫ్యామిలీ పై కామెంట్స్ చేసిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

నా కూతురు జోలికి వస్తే ఒక్కొక్కరికి పగులుద్ది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక రవి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తనకు చాలా ధైర్యం చెప్పి పంపించారట. రవి అలా చెప్పడంతో తన భార్య నిత్య కూడా చాలా బాధ పడినట్లు తెలిసింది. కానీ నేను ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నానని  తెలియజేస్తూ ఉంది. తాజాగా యాంకర్ రవి కి ఉన్న సోషల్ మీడియా ఖాతా ఓపెన్  చేయాలంటే చాలా భయం వేస్తోంది అంటూ తెలియజేస్తున్నారు. ఇక అందులో కొన్నిటిని కూడా డిలీట్ చేసాను అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: