జబర్దస్త్ వేదికపై పంచులు వేసే కంటెస్టెంట్ లలో హైపర్ ఆది కూడా ఒకరు. తనకి సమయం దొరికినప్పుడల్లా కొన్ని ఈవెంట్లూ, ప్రోగ్రాములు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. అయితే తాజాగా న్యూ ఇయర్ స్పెషల్... షో లో"పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు" లో బాగానే సందడి చేశారని చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య అతిథిగా వర్మ వచ్చారు. ఇక ఈ షో కి హైపర్ ఆది తండ్రి తన సోదరులను తీసుకువచ్చి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది.


తన తండ్రికి ఉన్న అలవాట్లను హైపర్ ఆది తెలుపుతూ కొన్ని కామెంట్స్ చేయడం వల్ల అవి వైరల్ గా మారాయి.. తన తండ్రికి ఎక్కువగా బంగారం అంటే ఇష్టం అని తెలియజేశారు. హైపర్ ఆది మాట్లాడుతూ తన తండ్రి ఉదయం లేవగానే నీట్ గా రెడీ అయ్యి.. ఎక్కడో పనిమీద బయటికి వెళ్తారు అనుకుంటారు కానీ మా నాన్న వెళ్ళేది కేవలం వైన్ షాప్ కి అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక అక్కడ జరిగే కొన్ని విషయాల గురించి కూడా తెలియజేశారు.. ఇక హైపర్ ఆది తన తండ్రిని ఎన్నిసార్లు వెళ్లొద్దు.. మేము తీసుకు వస్తాము అని తెలియజేసినా కూడా... నాన్న మాత్రం నా మాట లెక్క చేయకుండా వెళ్తారు అని చెప్పుకొచ్చారు. అప్పుడు తన తండ్రి మాట్లాడుతూ అక్కడ మినిమం ఒక 50 మంది లైన్ లో ఉంటారు.. అక్కడ నన్ను చూసినవారంతా హైపర్ ఆది వాళ్ళ నాన్న వచ్చారు అంటూ ఎంతో గౌరవం ఇస్తారని తెలియజేశాడు.

ఇక ఆ తర్వాత వారి ఫ్యామిలీ లో ఉండే ప్రేమ అనురాగాలు గురించి తెలియజేశారు ఆది. తండ్రి కూడా మా ఆది లేనిదే మేము లేము అని తెలియజేశారు. ఇక హైపర్ ఆది కి సపోర్ట్ గా నిలిచిన వారి ఫ్యామిలీ లోని తమ సోదరులకు కూడా ఎంతో ఇష్టమని తెలియజేశారు. ఇక హైపర్ఆది వివాహ విషయానికి వస్తే ఒంగోలు అమ్మాయిని చూశాము కానీ వద్దన్నాడు.. ఇంకా రెండు సంవత్సరాలు గడువు కావాలని తెలియజేస్తానని తెలుపుతూ వచ్చాడు హైపర్ ఆది తండ్రి...

మరింత సమాచారం తెలుసుకోండి: