సినీ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా విడాకుల గొడవలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. యంగ్ కపుల్స్ నుండి సీనియర్ హీరోల వరకు అందరూ కూడా వీటి బాటనే పడుతూ ఉంటూ అభిమానులకు సైతం షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ కూడా ఇలా విడాకుల గురించి ప్రకటించి అభిమానులను చాలా ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు మరొక హీరోయిన్, బుల్లితెర జడ్జ్  ప్రియమణి ఇదే లిస్టు లో చేరబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం. ఇక ప్రియమణి ముస్తఫా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. ఇక ముస్తాపాకు ఇదివరకే వివాహం అయింది కూడా.


ఇక దీంతో వీరిద్దరూ ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారింది ఇక అంతేకాకుండా ప్రియమణి పైన కేసు కూడా పెడతామని ముస్తఫా మొదటి భార్య బెదిరించింది. కానీ ప్రియమణి ఏ మాత్రం లొంగకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి ఆఫర్లను అందుకుంటు ఉన్నది ప్రియమణి ఇక తన వివాహ బంధానికి బ్రేక్ వస్తున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది.


ఇక ప్రియమణి తన భర్తకి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది అన్నట్లుగా వార్తలు వినిపించడంతో ఈ విషయం చాలా హల్చల్ చేస్తున్నది వీళ్ళకి పెళ్లి చాలా కాలం అయినప్పటికీ ఇంకా పిల్లలు కాలేదు
.. ప్రియమణి అందుకు వద్దున్నట్లుగా సమాచారం . కెరియర్ సెటిల్ అయ్యాకే పిల్లలని ప్లాన్ చేసుకుందామంటూ అవాయిడ్ చేస్తున్నారట. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు వెల్లుపడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటివరకు ప్రియమణి మాత్రం ఏ విధంగా స్పందించలేదు.. మరి ఇప్పుడైనా స్పందిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ప్రియమణి పలు సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది. ఇక నారప్ప, విరాటపర్వం వంటి సినిమాలతో బాగానే ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: