వాస్తవానికి తెలుగు వెండితెరపై ఇతర బాషా హీరోయిన్లు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లే తెలుగు బుల్లితెరపై కూడా కన్నడ భామలు తెగ హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి చాలామంది తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం గమనార్హం. బుల్లితెర హీరోయిన్ అనగానే తక్కువ స్థాయి బ్యూటీ అని అందరూ అనుకుంటారు కానీ ఈ మధ్య బుల్లితెర భామలు కూడా తమ అందం, అభినయంతో వెండితెర హీరోయిన్లతో పాటు సమానంగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంటున్నారు.

ఇకపోతే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.. జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నిజానికి అనుకి నటన మీద అసలు ఆసక్తి లేదు.. కానీ అనుకోకుండానే నటి అయింది.. తెలుగు వారి ఆదరణ సొంతం చేసుకున్న ఈమె కర్ణాటక నుంచి వచ్చిన వారే. నటనపై ఇష్టం లేకపోయినా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

మరొకవైపు అదే జీ తెలుగులో ప్రసారమవుతున్న కృష్ణ తులసి అనే ధారావాహికలో శ్యామా పాత్రలో నటిస్తున్న కన్నడ హీరోయిన్ ఐశ్వర్య హెచ్ కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె పుట్టి పెరిగిందంతా బెంగళూరులో అయినా కన్నడ పరిశ్రమ కంటే తెలుగు బుల్లితెర అంటేనే ఎక్కువ మక్కువ చూపుతోంది. ప్రముఖ బ్యూటీ కీర్తీ భట్ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే.. తెలుగు సీరియల్స్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈమె ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరొకవైపు అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు అంటూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కర్ణాటక ముద్దుగుమ్మ చైత్ర రాయ్ కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా చైత్ర రాయ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: