అయితే ఇప్పుడు ఇదే తరహాలో తెలుగు సీజన్ 7 లో కూడా మరుగుజ్జు కంటెస్టెంట్ ని తీసుకురాబోతున్నారు. ఈ కోటాలో మొన్నటి వరకు జబర్దస్త్ కమెడియన్ నరేష్ పేరు వినిపించగా.. ఇప్పుడు నరేష్ ప్లేస్ లో బిగ్ బాస్ హౌస్ లోకి గల్లీ బాయ్స్ రియాజ్ రాబోతున్నట్లు సమాచారం. రియాజ్ ఇప్పటికే కామెడీ షో లతో బాగా పాపులర్ అయిపోయాడు. బొమ్మ అదిరింది, అదిరింది వంటి షోలతో పాటు జబర్దస్త్ కామెడీ షో లో కూడా కనిపించి.. అలరించిన రియాజ్ రీసెంట్ గా దసరా సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే.
అంతే కాదు ఇటీవల పాలిటిక్స్ లోకి కూడా అడుగుపెట్టిన ఈయన మొన్న జరిగిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన నుంచి నెల్లూరు 30 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇక్కడ కేవలం 12 ఓట్లు మాత్రమే రియాజ్ కి వచ్చాయి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు రియాజ్ మరి ఏ విధంగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి