తాజాగా తెలుగులో ఇటీవలే బిగ్ బాస్-7 ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే.. ఈసారి విన్నర్ గా కామన్ మ్యాన్ కింద రైతుబిడ్డ అయినా ప్రశాంత్ విన్నర్ గా గెలవడం జరిగింది. దీంతో చాలామంది సైతం అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ప్రశాంత్ కెరియర్ మారిపోతుందని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా గత సీజన్ల విన్నర్లు గురించి ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతూ ఉన్నాయి. బిగ్ బాస్ విన్నర్ అయితే కెరియర్ మారుతుందా గత సీజన్లో విన్నర్గా వారిన వారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


గత సీజన్ల కంటెస్టెంట్ల విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ -6 విషయానికి వస్తే విజేతగా రేవంత్ నిలవడం జరిగింది. సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రేవంత్ అంతకుముందు సోనీ టీవీలో ఇండియన్ ఐడల్-9 విన్నర్ గా కూడా గెలిచారు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ఒక పాటను పాడి మంచి పాపులారిటీ అందుకోవడం జరిగింది.. బిగ్ బాస్ లోకి రాకముందు రేవంత్ కి మంచి క్రేజ్ ఉండేది కానీ బిగ్ బాస్ వల్ల పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.


బిగ్బాస్ సీజన్-5 విన్నర్ విజే సన్ని నిలిచారు.. కెరియర్ పరంగా సన్నీకి పెద్దగా సినిమాలు చేస్తున్న కలిసి రాలేదు. ప్రస్తుతం పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ -4 విన్నర్ విజేతగా ఆబిజిత్ నిలిచారు.. ఒకప్పుడు సినిమాలలో బిజీగా ఉన్న ఆబిజిత్ కాలం కలిసి రాక ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ట్రావెలర్ గా మారి పలు దేశాలలో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్  సీజన్-2 కౌశల్ మంద ఈ కంటెస్టెంట్ చేసిన హడావిడి బిగ్బాస్ చరిత్రలోనే ఎవరు చేసి ఉండాలని చెప్పవచ్చు.. బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు పిఆర్ టీమ్ సెట్ చేసుకొని మరి హడావిడి చేశారు. స్టార్ గా ఎదగాలని ప్రయత్నించిన పెద్దగా ఒరిగిందేమీ లేదు. దీంతో ఓన్ గా పలు రకాల బిజినెస్ ని మొదలుపెట్టారు కౌశల్.

బిగ్బాస్ మొదటి విన్నర్ గా నిలిచిన శివబాలాజీ అంతకుముందు పలు సినిమాలలో నటించారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా దూరమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: