సుడిగాలి సుదీర్ బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా ఉండేవారు. వెండితెర పైన ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పుటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.. ముఖ్యంగా క్రేజ్ తగ్గిపోవడమే కాకుండా అభిమానులు కూడా కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ఇటీవల సుడిగాలి సుధీర్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. తన కెరియర్లో గాలోడు సినిమా తప్ప మరో సినిమా కూడా పెద్దగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోతున్నాయి.. తక్కువ బడ్జెట్లో సినిమాల అయితే తెరకెక్కిస్తున్నారు కానీ అందుకు తగ్గ కలెక్షన్స్ కూడా రాలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.


ప్రస్తుతం సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర అనే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తన తదుపరిచిత్రం GOAT అనే టైటిల్ తో సుధీర్ ఒక సినిమాను చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ సుధీర్ ఇటీవలే ఒక కామెడీ షో లో రియంట్రీ ఇవ్వడం జరిగింది.. అదే తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో కామెడీ ఎక్స్చేంజ్ పేరుతో కామెడీ షో స్త్రిమ్మింగ్ అవుతున్నది.


ఈసారి సీజన్ 2 ని డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించారు.యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తూ ఉండగా.. ముక్కు అవినాష్, రోహిణి ,సద్దాం ,యాదమ్మ రాజు తదితర కమెడియన్స్ సైతం స్కిట్లు చేయడం జరిగింది. కామెడీ ఎక్స్చేంజ్ -2 లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇవ్వడంతో అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు డైరెక్టర్ అనిల్ రావుపూడి.. అలాగే తనని హెల్ప్ చేసుకోవడంతో పాటు అదిరిపోయే పంచ్ వేయడం జరిగింది.. మరి సుడిగాలి సుదీర్ ఈ షో కి కేవలం గెస్ట్ గా వచ్చాడా లేకపోతే ఇందులో కొనసాగిస్తాడు అనే విషయం తెలియాల్సి ఉంది.గతంలో జబర్దస్త్, ఢీ ఇతర షోలలో కూడా సుధీర్ కొన్నేళ్లపాటు చేశారు. ఈ మధ్యనే వాటన్నిటికీ గుడ్ బై చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AHA