తెలుగు బుల్లితెరపై ప్రసారమైనటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు మంచి ప్రేక్షకధారణ భారీగా ఉండేదని చెప్పవచ్చు.. ఈ సీరియల్ లో దీప క్యారెక్టర్ లో నటించిన ప్రేమి విశ్వనాథ్ ఎంతోమందికి సుపరిచితమే.. ఇందులో వంటలక్కగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.తెలుగులో ఇమే భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కార్తీకదీపం సీరియల్ లో దీపా పాత్రలో అలియాస్ వంటలక్కగా కూడా మంచి క్రేజ్ అందుకుంది.. ఈ సీరియల్ తర్వాత ఈమె క్రేజ్ పెరగడం జరిగింది. కానీ మళ్ళీ పలు సీరియల్స్ లో అవకాశాలు మాత్రం రాలేదట.

ఇటీవలే ఈ సీరియల్ కూడా పూర్తి కావడంతో చాలామంది ప్రేక్షకులు వంటలను చాలా మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.త్వరలోనే సీజన్-2 కార్తీకదీపం ద్వారా రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ సీరియల్ గురించి డైరెక్టర్ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ప్రేమి విశ్వనాథ్ తెలుగు సీరియల్స్ లో నటించకపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే కేరళలో చాలా రకాల బిజినెస్ లు ఉన్నాయట. కేరళలో సినిమాలు సీరియల్స్ నటించడమే కాకుండా రెండు స్టూడియోలను కూడా మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రేమి విశ్వనాథ్.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది .అచ్చం మహానటి సావిత్రి లాగా రెడీ అయ్యి సావిత్రి సినిమాలోని ఒక పాటకు రీల్ వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల సైతం అచ్చం సావిత్రి లాగానే ఉన్నారు మళ్లీ మీరు తెలుగు సీరియల్స్ లో నటించండి చాలా మిస్ అవుతున్నామంటూ అభిమానులు తెలుపుతున్నారు. మరి కొంతమంది సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు మీరు మహానటిల ఫీల్ అవుతున్నారా అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: