తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో నటి ప్రగతి కూడా ఒకరు.. ఈమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నప్పటికీ ఎక్కువగా జిమ్ వర్కౌట్ ఫిట్నెస్ విషయంలోనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. కెరియర్ మొదట్లో తమిళంలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.. దీంతో కొంత మంది సలహా మేరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంటూనే ఉంది.


ప్రగతి ఎక్కువగా తల్లి పాత్రలోనే నటించింది. ఇలా ఇప్పటికీ కూడా ఎన్నో చిత్రాలలో తెలుగు తమిళ్ భాషలలో నటిస్తూ ఉన్న ప్రగతి సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటుంది. ప్రగతి ఈమధ్య ఒక పోటీలో పాల్గొని థర్డ్ ప్రైస్ విన్నర్ గా గెలవడం జరిగింది.. సోషల్ మీడియాలో నిత్యం తన ఫోటోలను వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇలా వెండితెర పైన బిజీగా ఉన్న ఈమె బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బుల్లితెర సీరియల్స్ లో ఊర్వశివో రాక్షసివో అనే సీరియల్స్ లో ప్రగతి కీలకమైన పాత్రలో నటించారు.

ఈ సీరియల్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇలా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న ప్రగతి తన ఇంటి ఆవరణంలో పెద్ద ఎత్తున ఒక హోమాన్ని చేసినట్లుగా ఇందుకు సంబంధించి ఒక వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇలా హోమం చేయడానికి గల కారణం ఏంటా అంటూ అభిమానులు ఆరా తీయగా ఈమె హోమం చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వచ్చే సంవత్సరం కూడా అందరికీ చాలా మంచి కలగాలని కోరుకుంటూ ఈ వీడియో షేర్ చేస్తున్నట్లుగా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో పైన పలువురు అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: