బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రష్మీ గౌతమ్.. దాదాపుగా నాలుగు పదుల వయసు దగ్గర పడుతూ ఉన్న ఇప్పటికి ఇంకా వివాహం గురించి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. అయితే గత కొన్నేళ్లుగా సుడిగాలి సుదీర్ తో పులిహోర కలుపుతూ కనిపించిన రష్మీ దీంతో వీరిద్దరూ లవర్స్ అన్నట్టుగా అందరూ అనుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతారు అనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ తామిద్దరం కేవలం మంచి స్నేహితులను అంటూ ఒక విషయాన్ని తెలియజేశారు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి వివాహం చేసుకోవాలని పలు రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు.


సుధీర్ బుల్లితెరను వీడినప్పటికీ రష్మీ ఇంకా యాంకర్ గా పలు రకాల షోలను చేస్తూనే ఉంది.. ఇటీవలే సడన్ సర్ప్రైజ్ తో రష్మి పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలోనే తన కాబోయే వాడిని పరిచయం చేస్తానంటూ కూడా విషయాన్ని తెలిపింది. ఈ మేరకు పెళ్లి పార్టీ అనే ఒక పేరుతో చిన్న గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.


ఇయర్ ఎండింగ్లో పెళ్లి పార్టీ అనే ఒక స్పెషల్ ఈవెంట్ ప్రోమో అని రిలీజ్ చేయడం జరిగింది. మల్లెమాల సంస్థ ఇందులో తన పెళ్లికి సంబంధించి ప్రశ్నలు ఎదురు కాగా తన కాబోయే వాడిని పరిచయం చేస్తూ.. అందుకు సంబంధించిన విషయాలను తెలియజేయడం జరిగింది. తన కాబోయే వాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అందరిలాగే తనకు కూడా కొన్ని కలలు ఉన్నాయని ముఖ్యంగా పొడుగ్గా ఉండాలని అంటూ ఉండగానే వెనుక వైపు నుంచి క్లీన్ చేయవద్దు హైట్ పర్సనాలిటీ కలిగిన ఒక రొమాంటిక్ బాయ్ కనిపించారు ముఖ్యంగా అతనికి పిల్లి కళ్ళు తో పూర్తివైటుగా ఉన్నారు. చూడడానికి ఫారెన్ అబ్బాయిల కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన రష్మీ అతన్ని చూడగానే తన కళ్ళల్లో ప్రేమ ముఖంలో ఆనందం కనిపించింది. మొత్తానికి రష్మి తన చేసుకోబోయే వాడిని పరిచయం చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: