జబర్దస్త్ కామెడీ షో లో కామెడీయన్ గా కొనసాగించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిగా కిరాక్ ఆర్పి కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఈయన కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన స్కిట్లను చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.అయితే మల్లెమాల వారితో ఈయనకు వచ్చినటువంటి కొన్ని విభేదాలు వల్ల పూర్తిగా జబర్దస్త్ కు దూరమై ఆ కార్యక్రమం నుంచి బయటికి వచ్చి మల్లెమాల పైన చాలా విమర్శలు చేయడం జరిగింది.. అనంతరం కిరాక్ ఆర్పి స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో సందడి చేశారు..

అయితే ఈ కార్యక్రమంలో తనకు గుర్తింపు రాలేకపోవడంతో పాటు అవకాశాలు తగ్గుతూ ఉండడంతో తానే సొంతంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక కర్రీ పాయింట్ని పెట్టారు. హైదరాబాదులో మొదట ఈ రెస్టారెంట్ల సైతం మొదలుపెట్టిన కిరాక్ ఆర్పి భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో బ్రాంచెస్  లను సైతం ఇటీవల ఓపెన్ చేశారు. ఇకపోతే ఇటీవలే పెళ్లి చేసుకుని కిరాక్ ఆర్పి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. తన బిజినెస్ పరంగా అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రస్తుతం ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.


కిరాక్ ఆర్పి ఇటీవలే ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. తన బిజినెస్ ఇలా సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ అయితే తాను ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలకు కూడా తన చేపలు పులుసుని పంపించాను అంటూ తెలిపారు. బోయపాటి శ్రీనుకి అలాగే రామ్ చరణ్ ఉపాసన చిరంజీవి గారికి తన చేపల పులుసును పంపించాను అంటూ కిరాక్ ఆర్పి తెలిపారు.. వారందరి గురించి తాను ఏదో ఫీడ్ బ్యాక్ ఆశించి ఇలా చేయలేదని ఒకసారి మా చేపల పులుసు రుచి చూసిన తర్వాత మరొకసారి వారి నుంచి మాకు ఫోన్ కాల్ రావాలని లక్ష్యంతోనే ఇలా సెలబ్రిటీలకు పంపిస్తున్నామంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: