బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు. గతంలో ఈమె తెలుగు బుల్లితెర పైన మౌనరాగం అనే సీరియల్ తో పాటు మరెన్నో సీరియల్స్ లో కూడా నటించింది. ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ప్రియాంక తన ఆటతో మాటలతో అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ఈ కన్నడ బ్యూటీ గ్రాండ్ ఫినాలే వరకు బాగా వెళ్ళింది. విజేతగా నిలవబోతున్న సమయంలో ఐదవ స్థానంలో నిలవడం జరిగింది.. ఐదవ స్థానంలో నిలిచిన ఏకైక లేడీగా ఏడవ సీజన్లో పేరు సంపాదించింది ప్రియాంక.

హౌస్ లోకి అడుగుపెట్టేముందు సింగిల్ అని చెప్పిన ప్రియాంక బిగ్ బాస్ వేదిక పైన తన ప్రియుడు శివ్  కుమార్ తో ప్రేమలో ఉన్నానంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.. ఇదంతా ఇలా ఉండగా ప్రియాంకకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈమె ఒక ముఖ్యమైన సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లుగా తన ప్రియుడు తెలియజేశారు. అదేమిటంటే గత 20 ఏళ్ల నుంచి ప్రియాంక కంటి సమస్యలతో ఇబ్బంది పడుతుందట..


అందుకే ఆమె ఎప్పుడూ కళ్ళజోడుతో కనిపిస్తుందని షూటింగ్స్ లేదా ఏదైనా ఫంక్షన్లు ఇతర పార్టీలకు మాత్రమే లెన్స్ పెట్టుకుంటుందని ఈ లెన్స్ వాడడంతో చాలా ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన కళ్ళ సమస్యను శాశ్వతంగా తొలగించుకోవడం కోసం ఈమె వైద్యులను సంప్రదించగా వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ప్రియుడు శివ్ కుమార్ షేర్ చేయడం జరిగింది. ప్రియాంకకు సర్జరీ దగ్గర్నుంచి అన్ని తానే చూసుకుంటున్నట్లుగా వీడియో తెలియజేశారు.. ఇలా వీడియోలో కళ్ళ సర్జరీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: