బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ఇటీవలే ముగిసింది.. ఉల్టా పుల్టా అనే పేరుతో ఈ షో ఇటీవలే ముగిసింది ఇందులోని కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇదే సమయంలో బిగ్ బాస్ 7 సీజన్ పెద్ద ఎత్తున పలు రకాల వివాదాలు చోటు.. అన్నపూర్ణ స్టూడియో ఎదుట చాలామంది ఆకతాయిలు అల్లర్లు చేసి విన్నర్ గా అయిన పల్లవి ప్రశాంత్ పైన కేసులు నమోదు అయ్యేలా చేశారు.. ఆ తర్వాత జైల్లో ఉండి బెయిల్ రావడం ఇలా ముగిసిన తర్వాత బిగ్ బాస్ లో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.అయితే ఇప్పుడు బిగ్ బాస్ పేరుతో మరొక చీటింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. తనను బిగ్ బాస్ లోకి పంపిస్తామంటూ కొంతమంది డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ యాంకర్ స్వప్న చౌదరి ఒక వీడియోని సైతం రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి ఈవెంట్ ఆర్గనైజర్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలకు ఆమె సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.


బిగ్ బాస్ -1 ప్రారంభమైనప్పుడే ఈ సెలబ్రిటీ గేమ్ షో లోకి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేసిందట.. బిగ్ బాస్ -7 లో పంపిస్తామంటు ఒకరు 2.50 లక్షల రూపాయలు తీసుకున్నారని ఒక వీడియోని విడుదల చేసింది.తనకు బిగ్ బాస్ వెళ్లడం అంటే చాలా ఇష్టం అని నిద్రపోతున్న సమయంలో కూడా తాను బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నానని ఊహించుకుంటున్నానని తెలిపింది.. బిగ్బాస్ మొదటి సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు అన్ని చూస్తున్నాను తనని కంటెంట్ గా పంపిస్తారని తమ్మాలి రాజా అనే వ్యక్తి తన దగ్గర నుంచి ఈ డబ్బులు తీసుకున్నారని తెలియజేసింది.. ఆ సమయంలో తనకు ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చారని అయితే చివరి క్షణం వరకు పంపిస్తానని మోసం చేసిన ఈయన చివరికి పంపి లేకపోవడంతో డిసెంబర్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తాడని చెప్పగా ఇప్పుడు ఈ విషయం పైన ఎలా స్పందించలేదని తెలుపుతోంది.. కావాలంటే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసుకో అంటూ వార్నింగ్ ఇస్తున్నాడని తెలుపుతోంది యాంకర్ స్వప్న తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: