ఏ ఇండస్ట్రీలో నైనా నటీనటులకు సైతం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.అయితే మన తెలుగు బుల్లితెర పైన చాలామంది 40+ వస్తున్నప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని ఎక్కువగా గడిపేస్తున్నారు.. అయితే అడపా దడపా సినిమాలలో నటిస్తూనే భారీ క్రేజ్ అందుకున్న బుల్లితెర యాంకర్స్ నటుల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా పేరుపొందిన ప్రదీప్ మాచిరాజు ఎంతో కాలం నుంచి అభిమానులు ఆయన వివాహం కోసం ఎదురు చూస్తున్నారు.కానీ ఇప్పటివరకు వివాహ పూసే ఎత్తలేదు.. ప్రస్తుతం ఈయన వయసు 38 సంవత్సరాలు.


జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన హైపర్ ఆది ఇప్పటికి సింగిల్గానే ఉంటున్నారు. పలు సినిమాలలో నటిస్తూ కమెడియన్ గా బాగానే సక్సెస్ అయిన తన తోటి కమెడియన్లు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటే ఇతను మాత్రం బ్యాచిలర్ లైఫ్ లోనే ఉన్నారు.


మరొక కమెడియన్ బుల్లితెర హీరోగా పేరుపొందిన సుడిగాలి సుదీర్ కూడా అంతే.. గతంలో రష్మీ తో లవ్ ట్రాక్ నడిపినట్టు వార్తలు వినిపించిన అవన్నీ రూమర్స్ గాని మిగిలిపోయాయి.. హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నారు.


బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ కూడా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. రష్మీ వివాహం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈమె వయసు 35 సంవత్సరాలైనా వివాహం చేసుకోలేదు.

మరొక యాంకర్ విష్ణుప్రియ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం యాంకర్ గా కూడా చేయకపోయినా ప్రైవేట్ ఆల్బమ్స్లలో చేస్తోంది.ఈమె ఏజ్ 38 ఏళ్లు అయినా ఇంకా సింగిల్ గానే ఉన్నది.


మరొక యాంకర్ వర్షిణి.. ఢీ , జబర్దస్త్ ఇతరత్రా కామెడీ షోలలో కనిపించిన ఇ ఆమ్మడు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉన్నది. ఈమె కూడా ఇంకా వివాహం చేసుకోకుండా సింగల్ గానే ఉన్నది.. వీరితోపాటు యాంకర్ శ్రీముఖి కూడా ఇంకా సింగిల్ గానే ఉన్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: