కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ బ్యూటీ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో మౌనిత క్యారెక్టర్ లో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ముఖ్యంగా ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలకు చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు అదే క్రేజ్ తో ఇటీవల తెలుగులో ముగిసిన బిగ్బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చి.. తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది ..బిగ్ బాస్ లో లేడీ సింఘం లా దూసుకుపోయింది. దీంతో పాపులారిటీ తోపాటు ఫేమ్ కూడా లభించింది. ఇకపోతే శోభా శెట్టి కి బిగ్ బాస్ షో ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అదే స్థాయిలో నెగెటివిటీ కూడా మూటగట్టుకుంది.

చిన్న విషయాలకు కూడా గొడవ పడడం, ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడం.. తానే సాధించాలి అనే పంతం ఆమెపై ట్రోలింగ్ జరిగేలా చేశాయి. ఇక అందరికంటే ఎక్కువ సోషల్ మీడియాలో నెగెటివిటీని మూటగట్టుకుంది. ఇక తాజాగా తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఏడాదిన్నర క్రితమే ఆ ఇంటిని శోభా శెట్టి కొన్నప్పటికీ.. రీసెంట్గా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున ఇంటి తాళాలను శోభ దక్కించుకుంది. దీంతో ఆమె తల్లి,  కాబోయే భర్త యశ్వంత్ తో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్ళింది శోభా శెట్టి.

ఇకపోతే ఈ ఆనంద క్షణాలను ఆమె అభిమానులతో పంచుకోవడంతో చాలామంది బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ.. బిగ్బాస్ తో వచ్చిన డబ్బుతో తాను ఇంటిని కొనలేదని శోభా శెట్టి క్లారిటీ ఇచ్చింది.  తనకు బిగ్ బాస్ నుంచీ కోట్లల్లో డబ్బు రాలేదని.. ఇల్లు కొన్నంత మాత్రాన నేను కోటీశ్వరాలుని అయిపోను అంటూ ఆమె తెలిపింది. ఇంటి నిర్మాణం వెనుక ఎన్నో కష్టాలు పడ్డాను.. రెండేళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చాము.. కానీ వాళ్ళు మోసం చేశారు. అలా మోసపోయాను. కానీ ఏడాదిన్నర తర్వాత ఈ ఇంటిని కొన్నాను. కానీ నేను సొంత డబ్బులతోనే ఇంటిని కొనుగోలు చేశాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: