టాలీవుడ్ లో సీనియర్ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సన. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా దాదాపుగా 600కు పైగా సినిమాలలో నటించింది. పలు సినిమా సీరియల్స్ లో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు పెద్దగా రాలేదని అందుకే సీరియల్స్ లో ఎక్కువగా పలు క్యారెక్టర్లలో నటిస్తున్నానని తెలిపింది. అలాగే సన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ ప్రారంభంలో తన ఎదుర్కొన్న కష్టాలను గురించి అవమానాల గురించి తెలిపింది.


డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిందట సన. ఈమె పూర్తి పేరు షానూర్ సన. కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదివిందట. ఈమె తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడంతో మోడలింగ్ వైపుగా ఇష్టం ఉన్నప్పటికీ.. ఈ విషయాన్ని గుర్తించిన అంతమామల సైతం ఆమెలోని ఉండి ప్రతిభను సైతం ప్రోత్సహించారట. ఆమెకు అండగా కూడా నిలబడ్డారని తెలిపింది. ముఖ్యంగా సన తల్లి ముస్లిం.. తండ్రి క్రిస్టియన్ అయినప్పటికీ ముస్లిం సాంప్రదాయంలోని ఈమె ఎక్కువగా పెరిగిందట.


తన అత్తమామలు కూడా ఒప్పుకోవడంతో అలా ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేశానని.. కానీ చుట్టుపక్కల వారంతా బుర్కా వేసుకోలేకపోవడంతో నానా మాటలు అనేవారని ఇవన్నీ భరించే ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపింది. అయితే మొదట్లో అవకాశాలు రావడం కోసం పెళ్లై పిల్లలు ఉన్నారని చెప్పవద్దని చాలామంది తనకు సలహా ఇచ్చారని కానీ తాను అబద్ధం చెప్పి చేయవలసిన అవసరం ఏముందంటూ నిజము చెప్పేదాన్ని తెలిపింది. దీంతో తనకి హీరోయిన్గా అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది. అలా  ఎన్నో ఒప్పుకున్నటువంటి సినిమాలలో హీరోయిన్గా తీసేశారని తెలిపింది.. కాని తాను ఎప్పుడు బాధపడలేదని తన పని తాను చేసుకుంటూ వస్తున్నానని తెలిపింది.. మొదట తాను కూడా ఇండియన్ వ్యక్తిని ఆ తర్వాతే ముస్లిం అని తెలిపింది.తన కుటుంబంలోని పిల్లలను కూడా అలాగే పెంచుతున్నానని తెలిపింది సన.

మరింత సమాచారం తెలుసుకోండి: