తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ కనకాల పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు.. బుల్లితెర పైన టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె రాజీవ్ కనకాల భార్యగా కూడా బాగా సుపరిచితమే.. వీరిద్దరూ ప్రేమించి మరి వివాహం చేసుకొని తమ జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. వివాహమైన తర్వాత యాంకర్ గా మొదలుపెట్టిన సుమ..దాదాపుగా 12 సంవత్సరాల పాటు స్టార్ మహిళా షో కి యాంకర్ గా చేసిన సుమ ఎన్నో చానల్స్ లో తన హవా కొనసాగించింది.. అయితే ఈమధ్య కాస్త షోలను తగ్గించిందని చెప్పవచ్చు. ఆడపా దడపా సినిమాలలో నటించిన అవి కూడా ఆకట్టుకోలేకపోయాయి.


అయితే యాంకర్ సుమ ,రాజీవ్ కనకాల కు ఒక కుమారుడు కూతురు ఉన్నది.. సుమ తన జీవితంలోకి రావడం వల్ల తన కెరియరే మారిపోయిందని  తెలిపారు. ముఖ్యంగా ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆర్థికంగా, మానసికంగా కూడా చాలా దృఢంగా ఉన్నట్లు తెలిపారు. తనవల్లే ఈరోజు తాను మంచి పొజిషన్లో ఉన్నానని.. తన తండ్రి చేసిన అప్పులను ఇద్దరం కలిసే తీర్చామని అలాగే.. తన తండ్రి అప్పులు ఎక్కువయి సూసైడ్ కూడా చేసుకొనే స్థాయికి వెళ్లారని.. ఆ స్థాయి నుంచి భారీగానే సంపాదించుకునే స్థాయికి సుమ వల్లే వెళ్లానని తెలిపారు.


అలాగే ఎన్ని షోలు చేసిన ఎంత పని చేసిన పిల్లలను తనను ఎప్పుడూ కూడా తాను నిర్లక్ష్యం చేసేది కాదని తెలిపారు. తమవి పర్మినెంట్ ఉద్యోగాలు కాదని..ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి తామే సొంతంగా యూట్యూబ్లో పలు షోలు చేస్తున్నామంటూ తెలిపారు. అంతేకాకుండా తన కుమారుడు హీరోగా ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చేత ఎక్కువగా తన కొడుకు సినీ లైఫ్ మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలియజేశారు రాజీవ్ కనకాల. ఏది ఏమైనా రాజీవ్ కనకాల కుటుంబానికి సుమ బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: