తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు. యాంకర్ కాకముందు పలు సినిమాలలో నటించిన అనసూయ పెద్దగా పాపులారిటీ అందుకోలేక పోయింది. కానీ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకొని క్షణం, రంగస్థలం, పుష్ప ఇతరత్రా సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల అనసూయ బుల్లితెర పైన యాంకర్ గా వీడి వెండితెర పైన పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే కామెంట్స్ ఫోటోల వల్ల చాలా ట్రోల్స్ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.


అనసూయ ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన సరి నిమిషాలలో వైరల్ గా మారుతోంది .తాజాగా అనసూయ లవ్ స్టోరీ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది ..గతంలో ఒక ఇంటర్వ్యూలో అనసూయ తన లవ్ గురించి తన ఇంట్లో తల్లిదండ్రులు తెలిసి ఎలా రియాక్ట్ అయ్యారో తెలిపింది. అసలు విషయంలోకి వెళ్తే సుశాంక్ తో అనసూయ పీకల్లోతులో ప్రేమలో ఉండేదట. ఈ విషయాన్ని తల్లితండ్రులతో చెప్పలేక తనకోసం ఒక పైలెట్ వరుడుని తల్లితండ్రులు ఓకే చేశారు.. కానీ చివరిగా తన తల్లితో తన ప్రేమ విషయాన్ని చెప్పించిందట అనసూయ.


కొద్ది రోజుల వరకు తన తండ్రి అసలు ఒప్పుకోలేదట.. దీంతో ఆ సమయంలో అనసూయ లేచిపోయి పెళ్లి చేసుకుందామనుకుందట.. కానీ ఈ విషయం తెలిసి అనసూయ తండ్రి కోపంతో ఇంటి నుంచి బయటకు గెంటేశారట.. అలా ఇంటి నుంచి బయటకు వచ్చి అనసూయ సుశాంక్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే అతను ఒప్పుకోలేదట. పెద్దలను ఒప్పించే గౌరవం గానే పెళ్లి చేసుకోవాలని చెప్పారట. ఆ తర్వాత కొంతకాలానికి ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో వివాహం చేసుకున్నారు.. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత సుశాంక్ ను అనసూయ తండ్రి అల్లుడుగా అంగీకరించారని తెలిపింది. తన పెళ్లిలో ఇంకా చాలానే ట్విస్టులు ఉన్నాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: