పలు రకాల చిన్నచిన్న క్యారెక్టర్లలో చేస్తే ఇండస్ట్రీలో రాణించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి అవకాశాలు వస్తూ ఉన్న మరి కొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా అవకాశాలను అందుకోలేకపోతూ ఉంటారు.. ఇదంతా ఇలా ఉంటే నెల్లూరు నీరజ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు..పలు రకాల వెబ్ సిరీస్ షార్ట్ ఫిలింలో నటించి బాగానే క్రేజీ సంపాదించుకుంది ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా గుర్తింపు అందుకోవాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను అంటూ ఎన్నోసార్లు చెప్పింది నెల్లూరు నీరజ.

అలా తనకు వచ్చిన అవకాశాన్నల్లా వినియోగించుకొని బాగానే పాపులారిటీ అందుకుంది. ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహారతో కలసి ఎన్నో షార్ట్ ఫిలింలో నవ్వించింది. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియోలో ఆమె కన్నీళ్ళతో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.ఎప్పుడు నవ్వుతూ ఉండే నెల్లూరు నీరజ ఎమోషనల్ అవ్వడంతో అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఈమె ఎమోషనల్ కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే తాను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్లు అవుతోందని..


ఈ 13 ఏళ్లలో మాక్సిమం అన్నిషోలను చేశాను చాలా కామెడీ పాత్రలలో కూడా నటించానని.. టీవీ షోలు సీరియల్స్ వెబ్ సిరీస్ ఇలా ఎన్నో నటించానని అయిన సినిమాలో అవకాశాలు రాలేదని.. సినిమాలలో కనిపించకుండనే చచ్చిపోతానేమో అనుకున్నానని కానీ తన కళ నెరవేరింది అంటూ తెలిపింది. సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలు ఆయనకు మేనత్తగా నటించానని ట్రైలర్లో తనని తాను చూసుకుంటే నా 13 ఎళ్ల కష్టం ఇట్టే పోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో అవమానాలు పడ్డాను చాలామంది తనను ఎగతాళి చేశారని తన పని అయిపోయిందంటూ ఎగతాళి చేసేవారు.. కానీ ఇప్పుడు నేను సిద్దు సినిమాలో నటించడం అలా అవకాశం ఇచ్చినందుకు సిద్దుకు కూడా థాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది నీరజ.

మరింత సమాచారం తెలుసుకోండి: