బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో కామన్ మ్యాన్గా అడుగుపెట్టి రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తనదైన గేమ్ స్ట్రాటజీతో స్టార్ కంటెస్టెంట్లను సైతం వెనక్కు నెట్టి మరి బిగ్ బాస్ టైటిల్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రైతుబిడ్డ అనే ట్యాగ్ తో హౌస్ లో బాగా క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.. అయితే బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తాన్ని కూడా రైతులకి ఇచ్చేస్తానంటూ అందరి ముందు హామీ ఇచ్చారు పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ వేదికతో పాటు ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని తెలిపారు.


సెప్టెంబర్ 17న బిగ్బాస్-7 ముగిసినప్పటికీ దాదాపుగా పల్లవి ప్రశాంత్ కు రూ .35 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. అలాగే రూ .15 లక్షల రూపాయల వరకు బంగారం రూ .15 లక్షల రూపాయల కారును కూడా అందుకున్నారు. అయితే సుమారు రెండు నెలలు అవుతున్నప్పటికీ పల్లవి ప్రశాంత్ రైతులకు ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రైతు బిడ్డని కేవలం గెలిచే వరకు చెప్పుకొని ప్రశాంత్ మోసం చేశారని మాటలు వినిపిస్తూ ఉన్నాయి.


ఈ సమయంలోనే పలు రకాల టీవీ షోలు పార్టీలతో బిజీగా ఉన్న పల్లవి ప్రశాంత్ ను సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ చేయడంతో..రోలింగ్ పైన స్పందిస్తూ ప్రాణం పోయినా ఇచ్చిన మాటను మరువను నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ నిరుపేద రైతు కుటుంబాల కోసం తాను గెలుచుకున్న డబ్బుని త్వరలోనే తీసుకుని మీ ముందుకి వస్తున్నాను జై జవాన్ జై కిసాన్ అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది పల్లవి ప్రశాంత్.. తనపై ట్రోల్ చేస్తున్న వారందరికీ ఇలా చెక్ పెట్టారు.. అయితే ప్రస్తుతం టాక్స్ లన్నీ పోయి కేవలం రూ .20 లక్షల లోపు డబ్బు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: