తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో కి కాస్త డిఫరెంట్ గానే క్రేజీ ఉందని చెప్పవచ్చు.ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ గానే షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. అలా నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజీ సంపాదించుకున్న తెలుగు అమ్మాయి దివి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత కొన్ని సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది.


ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.. బీటెక్ చదివే రోజులలో ప్రేమలో పడ్డామని.. ఎంటెక్ వరకు ఇద్దరం కూడా రిలేషన్ లో ఉన్నామని.. చివరికి  పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి అంగీకరించారు.. ముహూర్తం కూడా పెట్టుకున్నాము కానీ.. తన బాయ్ ఫ్రెండ్ తమ్ముడు అనారోగ్య సమస్యలతో మరణించారు.. అది కూడా బిగ్ బాస్ దివి కళ్ళముందే మరణించడంతో చివరి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయ్యేవరకు తన బాయ్ ఫ్రెండ్ కి తోడుగా ఉన్నానని తెలిపింది దివి.


ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు తన సొంత ఊరుకు తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళిపోయారు.. తాను మాత్రం ఇక్కడ హైదరాబాదులో ఉండాల్సి వచ్చిందంటూ తెలిపింది.. అలా ఇద్దరు కూడా విడిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని అయితే తనతో పాటు తనని తీసుకొని వెళితే తన కెరియర్ నాశనం అవుతుందనుకున్నాడట  దివి బాయ్ ఫ్రెండ్..ఈ విషయం తనకు చాలా రోజుల తర్వాత తెలిసిందని ఒక వేళ ఇది ముందే తెలిసి ఉంటే అతనితో పాటు తాను కూడా ఊరికి వెళ్ళిపోయేదాన్నేమో అన్నట్టుగా దివి తెలియజేసింది.. ఇలా తనలో స్టోరీ బ్రేకప్ అయ్యింది అంటూ ప్రేమ కథ గురించి బయట పెట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి: