ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు కిరాక్ ఆర్పీ.. అదే జబర్దస్త్ లో యాంకర్ గా రష్మీ అనసూయ ఇద్దరు కూడా యాంకర్ గా చేసేవారు.. ఈ పాపులరిటి తోనే పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నారు.. జబర్దస్త్ సక్సెస్ అవ్వడానికి వీరిద్దరి హస్తం ఉందని కూడా చెప్పవచ్చు.. 2013లో జబర్దస్త్ కామెడీ షో మొదలయింది రోజా నాగబాబు జడ్జ్ గా అనసూయ యాంకర్ కొంతమంది కమెడియన్సుతో ఈ షోని ప్రారంభించారు.. అనసూయ జబర్దస్త్ యాంకర్ ద్వారా సరికొత్త ట్రెండును సెట్ చేసింది..పొట్టి బట్టలలో గ్లామర్ గా కనిపించి ఏ తెలుగు యాంకర్ అల ఎక్స్పోజింగ్ చేసింది లేదు అనే అంతలా పాపులారిటీ సంపాదించుకుంది దీంతో ఎన్నో విమర్శలు కూడా ఆమె పైన ఎదురయ్యాయి.. వ్యక్తిగత కారణాలవల్ల అనసూయ తప్పుకోగా రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది.. అనసూయ ను రష్మీ ఫాలో అయ్యి ఈమె పేరు కూడా బాగా పాపులారిటీ అయ్యేలా చేస్తుంది. అనసూయ ఎంట్రీ ఇవ్వడంతో రష్మితో ఎక్స్ ట్రా జబర్దస్త్ మొదలుపెట్టారు.. ప్రస్తుతం అనసూయ తప్పుకోగా రష్మీ కొనసాగుతూనే ఉంది..


ఏళ్ల తరబడి జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న కిరాక్ ఆర్పీ అనసూయ రష్మి ఎలాంటి వారో తెలియజేశారు.. జబర్దస్త్ జడ్జిల గురించి కూడా యాంకర్ అడగగా కిరాక్ ఆర్పీ ఇలా మాట్లాడుతూ.. రష్మీ గురించి మాట్లాడుతూ రష్మి అప్పటివరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్ అని ఆమెకు తెలుగు సరిగ్గా రాకపోయినా తనకొచ్చిన స్లాంగుతో బాగానే సక్సెస్ అయిందని తెలిపారు.. రష్మీ ఎలా మాట్లాడినా కూడా చాలామంది నవ్వుకున్నారని తెలిపారు.. అనసూయ గురించి మాట్లాడుతూ యాంకర్ గానే కాకుండా సినిమాలలో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్లతో తన స్థాయిని పెంచుకుంటూనే ఉందంటూ తెలిపారు. సుధీర్ మల్టీ టాలెంట్ అని, గెటప్ శ్రీను కమల్హాసన్ అంటూ రాంప్రసాద్ ఆటో డైలాగులతో భారీ క్రేజ్ అందుకున్నారని తెలిపారు. జడ్జిలు అంటే నాగబాబు రోజా గారి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని తెలిపారు..ప్రస్తుతం చేపల పులుసు వ్యాపారం ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు కిరాక్ ఆర్పి.

మరింత సమాచారం తెలుసుకోండి: