ఒకప్పుడు జబర్దస్త్ లో కామెడీయన్ గా మంచి పాపులాట సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు.. తన కామెడీ పంచ్ డైలాగులతో ఎన్నో స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.. అయితే కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ మానేసి అనంతరం హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారాన్ని సైతం మొదలుపెట్టారు.. ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు కిరాక్ ఆర్పి.. ఆ తర్వాత పలుచోట్ల ఎన్నో బ్రాంచీలను కూడా మొదలుపెట్టారు. ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరాక్ ఆర్పి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ మానేయడానికి అసలు కారణం నాగబాబుగారి వల్లే మానేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఫుడ్, పేమెంట్స్ తో పాటు చాలా ఇబ్బందులు పెట్టారని వెల్లడించారు.. నాగబాబు గారు వదిలేయడం వల్లే నేను అక్కడ ఉండలేకపోయానని నాగబాబు గారు నవ్వితే జనాలు కూడా నవ్వుతారని .. అంతేకాకుండా ఆయన నవ్వారంటే కచ్చితంగా స్కిట్ కొట్టే వాళ్ళము.. అలాగే నాగబాబు కూడా అందరిని ప్రోత్సహిస్తూ ఉంటారని తెలిపారు.


ఎవరైనా సరిగ్గా చేయకపోతే ఊరుకోరు భయపెడతారు కొట్టే వరకు కూడా వెళ్తారని స్కిట్ సరిగ్గా చేయకపోతే అసలు సమస్య ఏంటి అని అడిగే వారిని అలాగే స్కిట్లో మితిమీరిన డబుల్ మీనింగ్ జోక్స్ ఉంటే వాటన్నిటిని తగ్గించేయాలని పలు రకాల సూచనలు ఇస్తూ జబర్దస్త్ ని ముందుకు నడిపించే వారిని.. రోజా గారు కూడా అలాగే తమకు ఎంతో సపోర్ట్ చేస్తూ అందరిని ఒక కుటుంబంలో చూసేవారని తెలిపారు.. నెల్లూరు యాసలో తన బాడి లాంగ్వేజ్తో మెప్పించిన కిరాక్ ఆర్పి కన్సిస్టెంట్ గా వచ్చి టీమ్ లీడర్ గా పేరు సంపాదించారు.. నాగబాబు గారు మానేయడం వల్ల జబర్దస్త్ నుంచి బయటికి రావడంతో తనని చాలామంది నాన్న మాటల అన్నారని మల్లెమాల వారు కూడా తీవ్రమని విమర్శలు చేశారని తెలిపారు. ప్రస్తుతం చేపల పులుసు వ్యాపారం ద్వారా నెలకు కొన్ని లక్షల సంపాదిస్తున్నానని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: