తెలుగు బుల్లితెర పైన సీరియల్స్ లో బాగా పాపులర్ అందుకున్న తర్వాత సినిమాలలో కూడా పలు పాత్రలలో నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది నటి హిమజ. స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ భారీగానే పాపులారిటీ అందుకుంది. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా హిమజకు మంచి సక్సెస్ అందుకున్నది. కానీ కెరియర్ పరంగా ఏమాత్రం ఇది ఉపయోగపడడం లేదు. హిమజ సినిమాల పరంగా బిజీగా ఉన్న అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉంటుంది.


అలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడం గురించి మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలు రిజర్వుడ్గానే ఉంటారనే వాదన ఉన్నది.. అందుకే వాళ్లకు ఎక్కువగా అవకాశాలు రావని అభిప్రాయం ఉంది ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ అడగగా.. అందుకు హిమజ ఇలా సమాధానాన్ని తెలుపుతూ.. తెలుగు అమ్మాయిలు రిజర్వుడు కాదని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయ్యింది.. అసలు విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆఫర్స్ రావడం లేదని.. అలాగని అవకాశాలు వచ్చిన వారందరి కూడా కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదని తెలియజేసింది.


అలాగే ఇండస్ట్రీలో ఉండేటువంటి క్యాస్టింగ్ కౌచ్ పైన హిమజ స్పందిస్తూ.. ఎంతోమంది తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే వారి అత్యాశ కారణంగా కొన్ని అవకాశాలు వదులుకుంటున్నారంటూ హిమజ వెల్లడించింది.. అందువల్లే తెలుగు వారికి అవకాశాలు రాకుండా ఇతర భాషలలో నటించే వారికి అవకాశాలు వస్తున్నాయని.. అయితే కొన్ని పాత్రలు కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయని అందుకోసమే ఇతర సెలబ్రిటీలను కూడా మన తెలుగు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్నారంటూ హిమజా వెల్లడించింది. హిమజా ఒకవైపు సీరియల్స్ లో మరొకవైపు సినిమాలలో మంచి క్యారెక్టర్లలో నటిస్తూ దూసుకుపోతోంది. తనకు వచ్చిన అవకాశాన్నల్లా వినియోగించుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నది హిమాజా. ప్రస్తుతం హిమజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: