బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన వారి పరిస్థితి బాగానే ఉంటుందని ఆడియస్స్ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అలా గెలిచిన వారికి స్టార్ స్టేటస్ వచ్చిన ఎందుకో నిలవలేక పోతున్నారు. అలా మొదటి నుంచి బిగ్ బాస్ 8 వరకు విన్నర్ అయిన వారి పరిస్థితిని చూస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా తెలుగు బిగ్ బాస్ 5 విన్నర్ గా నిలిచిన విజే సన్నీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఆఫర్లను ఆదుకున్నారు. ఆ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తన జీవితాన్ని మార్చేసింది.



ఈ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ షో 5లో మొదట్లో హడావిడి చేసిన అందర్నీ డామినేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ తర్వాత చివరికి కామెడీగా మారిపోయారు. అలా మంచి ఎంటర్టైన్మెంట్ గా మారిపోయిన సన్నీ హౌస్ లో ఉండే కంటెస్టెంట్లు అందరిలో కూడా ఒకరిగా పేరు సంపాదించారు. అలా విన్నర్ గా నిలిచిన సన్నీ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.


షో తరువాత అన్ స్టాపబుల్, సౌండ్ పార్టీ వంటి చిత్రాలలో కూడా హీరోగా కనిపించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీజే సన్నీకి ఎలా అయితే క్రేజీ వచ్చిందో అంత స్పీడుగా తగ్గిపోయింది. ప్రస్తుతం సన్నీ చేతులు సినిమాలు లేవు వెబ్ సిరీస్ కూడా లేవు. అయితే ఇటీవలే అవకాశాలు లేక వ్యాపార రంగంలోకి అడుగుపెడుతూ కృష్ణానగర్లో టిఫిన్ సెంటర్ ని మొదలుపెట్టారట. సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్ని కూడా అక్కడ లభిస్తాయని ఈ హోటల్ కి అమృతం అడ్డా అనే పేరుతో హోటల్ మొదలుపెట్టారు. అప్పుడప్పుడు కొన్ని రకాల షాపింగ్ ఓపెనింగ్స్ ఇవి కూడా వెళ్తున్నారట సన్నీ. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: