బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లవ్ స్టోరీ చెప్పి మరి కన్నీళ్లు పెట్టించిన నిఖిల్ అయితే షో గెలిచిన గెలవకపోయినా సరే కచ్చితంగా తన లవర్ కావ్య శ్రీ దగ్గరికి వెళ్తానని.. తాను ఏమన్నా సరే తనని వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ తెలియజేశారు నిఖిల్. ఒకవేళ ఆమె ఓవర్ చేస్తే కచ్చితంగా ఆమెను లేపుకెళ్ళిపోతా అంటూ కామెంట్స్ చేశారు.. అలాంటి నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అసలు కావ్య పేరు ఎక్కడ ఎత్తడం లేదు. ఒకవేళ షోలో అయినా కూడా తన బ్రేకప్ గురించి అడిగితే మాత్రం కేవలం మనుషులే మారిపోతున్నారు ఒకరి ఇష్టముంటే చాలా.. అటువైపు నుంచి ఉండాలి కదా అంటూ తెలియజేస్తున్నారు నిఖిల్.


కానీ ఫ్యాన్స్ మాత్రం అటు నిఖిల్, కావ్య శ్రీ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలే నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనని చాలామంది వీడు బయటోడు మనోడు కాదు అంటూ ద్వేషించారని.. కానీ తెలుగు ఆడియన్స్ తనను చేయి పట్టుకొని ఇప్పటి నడిపిస్తూ ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనని ఇష్టపడాలి అని రూలేం లేదు .. ద్వేషించాలంటే కనీసం రీజన్ అయినా ఉండాలి కదా అంటూ తెలియజేశారు నిఖిల్.


బిగ్ బాస్ షో తర్వాత నిఖిల్ ఎందుకు సైలెంట్ గా మారిపోయారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. బిగ్ బాస్ తర్వాత తనని చాలామంది మారిపోయారని తనతో చెబుతున్నారు.. నేను మారిన మాట వాస్తవమో .. కానీ తాను స్వతాగా మారాలనుకుని మారలేదని.. చాలా విషయాలే తనని మార్చేశాయని తెలిపారు. మనుషులకి కొన్ని పరిస్థితుల వల్ల తెలియకుండానే మారిపోతారు అవన్నీ మన చేతులలో లేవు.. అయితే అది వాళ్లు సొంతంగా మారరు పక్క వాళ్ళ పరిస్థితులే వాళ్ళని అలా మార్చేస్తూ ఉంటాయని.. చెప్పుడు మాటలు వినకూడదు అంటూ  ఇన్ డైరెక్టుగా కావ్య గురించి ప్రస్తావించారు నిఖిల్..


చివరికి తన లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించగా.. అందుకే ఎమోషనల్ అవుతూ తాను తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసి ఉంటే అది నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు సారీ చెబుతున్నాను అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: