తెలుగు బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గా ఒకప్పుడు మంచి స్టార్ డం సంపాదించుకున్నారు యాంకర్ రవి.. సంథింగ్ స్పెషల్ అనే టీవీ షో తో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో షోలకు యాంకర్ గా చేశారు. ఒకానొక సమయంలో హీరోగా కూడా పలు సినిమాలలో నటించిన యాంకర్ రవి ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. తాజాగా యాంకర్ రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోయారని దీంతో తనమీద చేతబడి చేయించి తన కెరియర్ పడిపోయేలా ప్రయత్నాలు చేశారంటూ తెలియజేశారు.


అయితే ఈ విషయం విని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. రవి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ బ్యాచ్ లోనే ఒక మహిళ యాంకర్ తన పైన చేతబడి చేయించిందని.. ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిన ఒక పూజారి దగ్గరకు వెళ్లి మరి ఆ పూజలు చేయించింది.. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా పూజలు చేయించిందనే విషయం తనకు తెలిసిందని కొన్ని నేను దగ్గరుండి కూడా ప్రత్యేకంగా చూశానని తెలిపారు యాంకర్ రవి. అయితే సాధారణంగా అలాంటి విషయాలను తాను నమ్మనని తెలిపారు. కానీ లోపల మాత్రం ఏం జరుగుతుందని భయం ఉంటుందని తెలిపారు.


సమాజం కూడా ప్రస్తుతం చాలా దారుణంగా మారిపోయిందని విద్యా వ్యవస్థ అనేది సరిగ్గా లేదు అందుకే చాలామంది సెలబ్రిటీలు కూడా ఇతర దేశాలకు వెళ్లి మరి తమ పిల్లలని చదువుకోవడం కోసం అక్కడే సెటిల్ అవుతున్నారని తెలిపారు.. పేదవాడు ఇంకా పేదవాడి గానే మారిపోతున్నారు.. సరైన ఎంప్లాయిమెంట్ లేక చాలా ఒత్తిడిలో నిరుద్యోగులు ఉన్నారు.. మరి కొంతమంది సోషల్ మీడియా తోనే ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారని తెలిపారు. తనకు కూడా విదేశాలలో బెటర్ ఫ్యూచర్ ఉందంటే మాత్రం అక్కడికే వెళ్లిపోతానని వెల్లడించారు. గతంలో కూడా యాంకర్ రవితో చాలామంది మహిళా యాంకర్స్ కలిసి పని చేశారు.. మరి యాంకర్ రవి పైన చేసిన ఈ పని ఎవరు చేసి ఉంటారు అంటూ అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: