ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి అందరికి తెలిసిందే అయినాగాని తన వినియోగదారులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లతో ముందుకు వస్తుంది. ఇలాగే ఇప్పుడు మరో సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది అద్భుతమైన ఆఫర్ అని చెప్పవచ్చూ. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఆ ప్లాన్ ఏంటో దానివల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న అద్భుతమైన ప్లాన్ రూ.1,699.. ఇకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులు. రూ.1,699 రీచార్జ్ ద్వారా లభించే లాభాలను వినియోగదారులు పూర్తిగా పొందాలనుకుంటే... ఆలస్యం చేకుండా మీరు వీలైనంత త్వరగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 30 లోపు ఎవరైతే రీచార్జ్ చేసుకుంటారో వారికి మాత్రమే 425 రోజుల ప్లాన్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఆ తర్వాత చేసుకుంటే మాత్రం కేవలం 365 రోజుల వ్యాలిడిటీని మాత్రమే పొందగలరు.


ఇదే కాకుండా అదనంగా రోజుకు 1 జీబీ డేటా  2019 డిసెంబర్ 31 వరకు లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ లాభాల విషయానికి వస్తే.. రోజుకు 2 జీబీ డేటాతో పాటుగా, 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటితో పాటుగా రోజుకు 250 ఉచిత నిమిషాల కాల్స్ చేసుకోవడానికి అందించనున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే డిసెంబర్ 31 వరకు మాత్రం రోజుకు 3 జీబీ డేటా లభించనుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని నెట్వర్క్‌ల దీర్ఘకాలిక ప్లాన్లలో ఇదే అత్యుత్తమ ప్లాన్ అని చెప్పవచ్చు.


ఎందుకంటే మిగతా సర్వీస్ ఆపరేటర్లు కూడా రూ.1,699కు ఉచిత కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను అందిస్తున్నప్పటికీ.. డేటా విషయంలో బీఎస్ఎన్ఎల్ మొదటిస్దానంలో ఉంది.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ తో పోల్చుకుంటే జియో రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుండగా, ఎయిర్ టెల్ 1.4 జీబీని మాత్రమే అందిస్తుంది. అయితే జియో తన యాప్స్ కు, ఎయిర్ టెల్ వింక్ మ్యూజిక్, ఎక్స్ స్ట్రీమ్ వంటి యాప్స్ కు యాక్సెస్ ను కల్పించడం ద్వారా అదనపు లాభాలను అందిస్తున్నాయి. కేవలం డేటా విషయంలోనే చూస్తే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థి ఆపరేటర్ల కంటే చాలా బెటర్‌గా ఉందని చెప్పవచ్చూ..


మరింత సమాచారం తెలుసుకోండి: