రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌ టెల్ మధ్య వార్ మళ్లీ ట్రాక్‌ లోకి వచ్చింది. అయితే ఈసారి VoWi-Fi సర్వీస్ యొక్క రోల్ అవుట్ విభాగంలో రెండు టెల్కోలు ఒకదానికొకటి వ్యతిరేకంగా నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ఇండియాలో భారతి ఎయిర్‌ టెల్ వినియోగదారులకు VoWi-Fi సర్వీసును అందించిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. దానికి పోటీగా వెంటనే రిలయన్స్ జియో కూడా దీనిని అనుసరించడం జరిగింది. 

 

రోలౌట్ VoWi-Fi సర్వీసుకు సంబంధించి రిలయన్స్ జియో ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ లీకైన కొంత సమాచారం ప్రకారం ఇది కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా మూడు టెలికాం సర్కిల్‌ లలో రిలయన్స్ జియో వినియోగదారులందరికీ VoWi-Fi సేవను అందించింది. భారతి ఎయిర్‌ టెల్ కూడా డిల్లీ NCR, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ముంబై, కోల్‌కతా సర్కిల్‌ లలో VoWi-Fi సర్వీసును లేదా వై-ఫై కాలింగ్ సేవను ప్రకటించింది. వీటిని సపోర్ట్ చేసే వాటి విషయానికొస్తే jio VoWi-Fi ఏదైనా VoWi-Fiను ప్రారంభించబడిన పరికరంలో పనిచేస్తుంది అని కంపెనీ తెలిపారు. 

 

భారతీయ వినియోగదారులకు VoLTE లేదా వాయిస్ ఓవర్ LTE టెక్నాలజీని పరిచయం ద్వారా రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి వచ్చింది. అయినప్పటికీ VoWi-Fi విభాగం విషయానికి వస్తే ఎయిర్టెల్ తన వై-ఫై కాలింగ్ సేవను వాణిజ్యపరంగా ప్రారంభించగలిగినందున కంపెనీ స్వల్ప తేడాతో పకాస్త వెంక పడిపోయింది. రిలయన్స్ జియో ఇప్పటికీ దేశంలో VoWi-Fi ప్రారంభించటానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా ఎక్కడ చేయలేదు. కాని చాలా మంది జియో కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో జియో Wi-Fi లభ్యతను గమనిస్తున్నారు. త్వరలో జియో VoWi-Fi సర్వీస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరింప చేయాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. 

 

రిలయన్స్ జియో కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా మూడు టెలికాం సర్కిల్‌ లలో VoWi-Fi సేవలను అందించడం ప్రారంభించింది. ఇందులో ఉత్తమమైన భాగం ఏమిటంటే ఇది ఎటువంటి బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్‌ లోనైనా పనిచేస్తుంది. ఉదాహరణకు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు ప్రారంభంలో ఎయిర్‌ టెల్ బ్రాడ్‌బ్యాండ్ పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎటువంటి ISP లో కూడా ఇది పనిచేస్తుంది. జియో VoWi-Fi మద్దతు ఉన్న పరికరాల విషయానికొస్తే VoWi-Fiను ప్రారంభించిన అన్ని డివైస్లలో ఈ సర్వీస్ యొక్క మద్దతు ఉంటుంది. IOS 13.3, అంతకంటే ఎక్కువ OSతో రన్ అవుతున్న ఆపిల్ ఐఫోన్‌ లకు కూడా దీని మద్దతు ఉంటుంది. వీటితో పాటుగా గెలాక్సీ M30s, గెలాక్సీ M30, గెలాక్సీ M20 వంటి శామ్‌సంగ్ ఫోన్లలో కూడా దీని మద్దతు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: