ఇటీవ‌ల మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులు కొట్టేసేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తున్నారు. టెక్నాలజీ ఎందరికో విజ్ఞానాన్ని అందిస్తే.. కేటుగాళ్లకి మాత్రం మోసాలు చేయడానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుత కాలంలో ఎక్క‌డ చూసినా సైబర్ నేరాలు విపరీతంగా జ‌రుగుతున్నాయి. అయితే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా?  జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవ‌ల ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇదేసమయంలో ఇంటర్నెట్ మోసాలు కూడా బాగా పెరిపోతున్నాయి.

 

బ్యాంక్ అకౌంట్ కలిగినవారు ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలి. బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ చాలా సురక్షితమైనది. హ్యాకర్లు దీన్ని బ్రీచ్ చేయడం కష్టం. అలాగే దీనితో పాటు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తేనే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండ‌గ‌లం. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎవ్వరికీ షేర్ చేయకూడ‌దు. అలాగే ఈ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ అస‌లు చేసుకోవద్దు. యూపీఐ పిన్, ఎంపిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వాటిని ఎవరైనా కాల్ చేసి అడిగితే స‌మాదానం ఇవ్వ‌కూడ‌దు. 

 

గూగుల్ సెర్చ్‌ చేస్తే వచ్చే బ్యాంక్, మర్చంట్, కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్లతో జాగ్రత్తగా ఉండండి. అవి ఫేక్ నెంబర్లు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మ‌రియు  మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ వంటి వివరాలను అజాగ్రత్తతో ఫోన్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయ‌కూడ‌దు. అలాగే మీకు సంబంధం లేని యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంట‌నే డిలిట్ చేయాలి. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: