తాజాగా ప్రభుత్వ రంగ టెలికామ్ ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ ఒక వార్షిక ప్లాన్ ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుంటే కేవలం 1999 రూపాయలకే 365 రోజుల కంటే 71 రోజులు అదనంగా రోజుకు మూడు జీబీ డేటా లభిస్తుంది. 20 ఏళ్ల నుండి సెల్యులార్ సేవలను అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ అతి త్వరలోనే 4g ఇంటర్నెట్ ని అందించే యోచనలో ఉంది.

 

ఒకవేళ ఇదే గనుక జరిగితే బిఎస్ఎన్ఎల్ రిలయన్స్ జియో కి గట్టి పోటీ ఇస్తుంది అనడానికి ఏ సందేహం లేదు. ఆల్రెడీ జియో నెట్వర్క్ పై స్లో ఇంటర్నెట్ ఫిర్యాదులు ఎన్నో అందాయి. ఒకవేళ జియో కంటే తక్కువ ధరలకే ఎక్కువ వ్యాలిడిటీ, డేటాని అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ 4G వీడని అందించే రోజులు వస్తే అందరూ బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది.




ఇకపోతే ఈ రూ.1999 ప్లాన్ ని ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే... గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 15 లోపు RC 1999 తో రీఛార్జ్ చేయించుకుంటే 426(365+71) రోజల వాలిడిటీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందించండి. ఫిబ్రవరి 15వ తారీఖు ముగిసింది. అయితే బిఎస్ఎన్ఎల్ సంస్థాన్ మళ్ళీ ఈ ప్లాన్ ని అందుబాటులోకి తెచ్చింది. మీరు ప్లాన్ అదనపు బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఫిబ్రవరి 28 లోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోలేకపోతే మార్చి ఒకటవ తారీఖు నుండి మార్చి 31 లోపు అదే ప్లాన్ అనగా 1999తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 60 రోజుల అదనపు వ్యాలిడిటీ లభించనుంది. అనగా 425(365+60) వ్యాలిడిటీ తో మీకు రోజుకి మూడు జీబీ డేటా లభిస్తుంది. డేటాతో పాటు ప్రతిరోజు కాలింగ్ కోసం 250 నిమిషాలు, అలాగే 100 ఎస్ఎంఎస్ లు ఈ ప్లాన్ లో అందించబడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: