లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం కదా అని మీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ లలో సినిమాలు చూస్తున్నారా? ఫుల్ హెచ్‌డీ లో పెట్టుకుని మరీ సినిమాలు చూస్తున్నారా? అయితే మీకు ఇదొక చేదు వార్త అనే చెప్పాలి. ఇక నుండి మీరు హెచ్‌డీ క్వాలిటీ లో సినిమాలు చూడలేరు. కేవలం ఎస్‌డీ క్వాలిటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనానే దీనికి ముఖ్య కారణం. కరోనా వల్ల హెచ్‌డీ క్వాలిటీ రాకపోడం అనేది వినడానికి కాస్త వింతగా ఉన్నా, ఇదే వాస్తవం. ప్రస్తుతం భారతదేశం మొత్తం లాక్ డౌన్ చేయడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ చేయడం వల్ల డేటా వినియోగం ఎక్కువైంది. దీని వల్ల ఇంటర్నెట్ వాడకం అంతకముందు కంటే రెట్టింపయ్యింది.        

 

 

దీని వల్ల నెట్వర్క్ కంపెనీలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని రోజులుగా డేటాకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఉన్న సెల్యులార్ నెట్వర్క్ మౌలిక వసతులపై తీవ్రమైన భారం పడుతోంది. ఈ సమస్య వల్ల టెలికాం ఆపరేటర్లలో ఆందోళన పెరిగింది. ప్రభుత్వం కూడా ఈ విషయం పై చాలా మదనపడుతోంది . ఈ సమస్యను పరిష్కరించడానికి ‘స్టార్ అండ్ డిస్నీ ఇండియా’ ఛైర్మన్ ఉదయ్ శంకర్ డిజిటల్ ఇండస్ట్రీలోని సంస్థలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు అందులో భాగంగా sony, google, facebook, Viacom18, amazon Prime Video, Zee, Tiktok, Netflix, MX Player, Hotstar సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. సెల్యులార్ నెట్వర్క్‌ను పటిష్టంగా ఉంచడంతో పాటు వినియోగదారులను, దేశం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

అన్ని సంస్థలు కలిసి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, అన్ని కంపెనీలు డిఫాల్ట్‌గా ఇచ్చే హెచ్‌డీ కంటెంట్, అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను ఎస్‌డీ కంటెంట్‌కు మార్చాలని, అలాగే సెల్యులార్ నెట్వర్క్‌లో 480పీ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించాయి. లాక్ డౌన్ ముగిసే వరకు అంటే ఏప్రిల్ 14 వరకు ఈ పద్ధతిని అమలు చేస్తారు. మనం కూడా మన దేశ సంక్షోభాన్ని అర్థం చేసుకుని మెలిగితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: