కొంతమంది కెమెరా ప్రియులు ఉంటారు.. ఏం కనిపించిన సరే ఫోటో అద్భుతంగా తీస్తుంటారు.. అయితే కొన్ని ఫోన్లలో తీసే ఫోటోలు క్లారిటీగా రావు.. అలాంటి సమయంలో కెమెరానే స్పెషల్ గా ఉండే ఫోన్లు కావాలి అని అనుకుంటుంటారు.. అలా అనుకున్న వారి కోసమే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఇప్పుడు ఓ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుంది.. ఆ కెమెరా చూస్తే సూపర్ అని అనకుండా ఉండలేరు.. అంత అద్భుతంగా ఉంది స్మార్ట్ ఫోన్. 

 

 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఈ నెల 19వ తేదీన మోటోరోలా ఎడ్జ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుంది. ఈ స్మార్ట్ కి సంబంధించిన ఓ టీజర్ ని విడుదల చేసింది.. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్సక్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం.. 

 

మోటోరోలా ఎడ్జ్ ప్లస్ స్పెసిఫికేషన్లు..

 

6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 

 

12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్,

 

వెనకవైపు మూడు కెమెరాల సెటప్ + ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగా పిక్సెల్ + 16 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరాలు. 

 

సెల్ఫీ కెమెరా 25 మెగా పిక్సెల్. 

 

5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్. 

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. 

 

మే 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు 75,300 రూపాయిలు ఉండే అవకాశం ఉంది. 

 

ఈ ఫీచర్లు అన్ని లీక్ అయినవే.. పూర్తి ఫీచర్లు తెలియాలి అంటే కాస్త సమయం పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: