ప్రముఖ ల్యాప్‌టాప్‌ సంస్థ లెనోవో 2 సరి కొత్త బడ్జెట్ థింక్ బుక్(ThinkBook) ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ప్రస్తుతం పని చేసేవారు సన్నగా ఉండే సమర్థవంతమైన ఫీచర్స్ తో వేగంగా పనిచేసే ల్యాప్‌టాప్‌లను వాడెందుకు ఇష్టపడుతున్నారు. అటువంటి ల్యాప్‌టాప్‌లతో ఏ దూర ప్రాంతాల్లో ఉన్నా... ఎవరి పని వారు సులభంగా చేసుకోవచ్చని లెనోవో సంస్థ ఇండియా ఎగ్జిక్యూటివ్ చెప్పుకొచ్చాడు. లెనోవో సంస్థ విడుదల చేసిన 2 కొత్త థింక్ బుక్ ల్యాప్‌టాపులు స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెసెస్ పనులను సమర్థవంతంగా, వేగవంతంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ పూర్తిచేసేందుకు ఉపయోగపడతాయి.


లెనోవా సంస్థ తాజాగా విడుదల చేసిన థింక్ బుక్ 14, థింక్ బుక్ 15 ప్రారంభ ధర ₹30, 990 ఉండగా... ఇవి తేలికపాటి బరువుతో సూపర్ డిజైన్ తో లభిస్తున్నాయి. చిన్న తరహా వ్యాపారవేత్తలు తమ పని విభాగంలో సమర్థవంతమైన తేలికపాటి ల్యాప్‌టాప్‌లు ఉండాలనుకుంటారు. అటువంటి వారందరికీ మా థింక్ బుక్ ల్యాప్‌టాప్‌లు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి అని ఇండియన్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ సిక్కా అన్నారు.


మల్టీటాస్కింగ్ సాఫీగా చేసేందుకు థింక్ బుక్ 14, థింక్ బుక్ 15 లలో AMD రేడియన్ 625, 620 గ్రాఫిక్ కార్డులు అమర్చబడ్డాయి. ఇవి కంటెంట్ వినియోగాన్ని మరింత ఆనందదాయకంగా మారుస్తాయి. వెబ్ పేజీలను వేగంగా లోడ్ చేస్తాయి. వీడియోను చాలా వేగవంతంగా ప్రసారం చేస్తాయి. చిత్రాలను స్పష్టంగా ప్రదర్శిస్తాయి. వేగవంతమైన ఫైల్ బదిలీలను సులభతరం చేయడానికి థింక్ బుక్ లాప్టాప్స్ లలో USB టైప్-సి పోర్ట్‌లు అమర్చారు. రెండు ల్యాప్‌టాప్‌లలోని సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ ఇవ్వగా... వీటి బ్యాటరీ కేవలం ఒక గంటలోనే 80 శాతం వరకు ఛార్జ్ చేసే రాపిడ్‌ఛార్జ్ టెక్నాలజీ ఈ ల్యాప్‌టాప్‌లలో ఇవ్వబడింది.



ఈ థింక్ బుక్ ల్యాప్‌టాప్‌లలో స్మార్ట్ పవర్ ఆన్ అనే ఫ్యూచర్ లభిస్తుంది. స్మార్ట్ పవర్ ఆన్ అనే ఫీచర్ పవర్ ఆన్ బటన్ పై అమర్చగా... దానిపై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫీచర్ తో కేవలం మీ ల్యాప్‌టాప్‌ ని మీరు మాత్రమే స్విచ్ ఆన్ చేయగలరు.


థింక్ బుక్ 14 స్పెసిఫికేషన్స్ ఒక్కసారి చూసుకుంటే... ఈ ల్యాప్‌టాప్‌ లో 10th జన్ ఇంటెల్ కోర్ i7 6-కోర్ ప్రాసెసర్, AMD రేడియన్ 625 గ్రాఫిక్ కార్డు, SSD- ఓన్లీ మోడల్ సైజులో డ్యూయల్ డ్రైవ్ సపోర్ట్, ఫుల్-ఫంక్షన్ టైప్-సి పోర్ట్ (Gen 2), హిడెన్ USB పోర్ట్, వైఫై 6, ఇంకా సామర్ధ్యం 12 గంటల వరకు నిర్విరామంగా పనిచేసే సమర్థవంతమైన బ్యాటరీ లభిస్తుంది.


థింక్ బుక్ 15 స్పెసిఫికేషన్స్ ఒక్కసారి చూసుకుంటే... ఈ ల్యాప్‌టాప్‌ లో 10th జన్ ఇంటెల్ కోర్ i7 6-కోర్ ప్రాసెసర్, AMD రేడియన్ 620 గ్రాఫిక్ కార్డు, SSD- ఓన్లీ మోడల్ సైజులో డ్యూయల్ డ్రైవ్ సపోర్ట్, స్కైప్ బిజినెస్ కోసం హాట్ కీస్, స్మార్ట్ పవర్ ఆన్, ఇంకా సామర్ధ్యం 12 గంటల వరకు నిర్విరామంగా పనిచేసే సమర్థవంతమైన బ్యాటరీ లభిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: