గూగుల్, యాపిల్ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేసిన కొత్త కాంటాక్ట్ ట్రేసింగ్ స్టాండర్డ్ ఆరోగ్య సేతు అప్లికేషన్ కి కంపాటిబుల్ కాదని తేలింది. ఇండియన్ కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ అయిన ఆరోగ్య సేతు లో 10కోట్ల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. అయితే ఈ యాప్ లో కొన్ని ఫ్యూచర్స్ గూగుల్, ఆపిల్ ప్రైవసీ సెట్టింగులను దాటి పనిచేయవు. ఫలితంగా కరోనా వ్యాప్తి గురించి కచ్చితమైన సమాచారం సేకరించలేదు. సాంకేతిక నిపుణులు కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాన్ని కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుత స్టాండర్డ్ పద్ధతిని డెవలప్ చేశారు. 23 దేశాలు యాపిల్, గూగుల్ సంస్థలు తయారుచేసిన టెక్నాలజీ పై తమ ఆసక్తి వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఆరోగ్య సేతు లాంటి యాప్స్ మినహాయించి సరికొత్త ఫీచర్స్ తో రానున్న కొత్త యాప్ లపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. 


ఇండియన్ ఆరోగ్య సేతు అప్లికేషన్ లో లొకేషన్ ట్రాకింగ్ ఫ్యూచర్ అందుబాటులో ఉంటుంది. కానీ గూగుల్, యాపిల్ సంస్థ కలిసి సంయుక్తంగా డిజైన్ చేసిన యాప్ లో లొకేషన్ ట్రాకింగ్ ఫ్యూచర్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. లొకేషన్ ట్రాకింగ్ కారణంగా వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలిసే ప్రమాదముందని ఎంతో మంది నిపుణులు హెచ్చరించారు. కానీ మన భారతదేశ ప్రభుత్వం మాత్రం లొకేషన్ ట్రాకింగ్ ని నిలిపివేసేందుకు తీవ్ర వ్యతిరేకత చూపుతుంది. 


యాపిల్, గూగుల్ సంస్థలు తమ టెక్నాలజీని ఉపయోగించుకుని కాంటాక్ట్ ట్రేసింగ్ ఎప్పుడైనా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చని... ఇందుకుగాను అప్లికేషన్ ని డిలీట్ చేస్తే సరిపోతుందని... లేదా నోటిఫికేషన్ సెట్టింగులు మార్చుకుంటే సరిపోతుంది అని వెల్లడించింది. లొకేషన్ ట్రాకింగ్ తో పాటు... యాపిల్, గూగుల్ సంస్థలు తమ మార్గదర్శకాలు ప్రకారం రాండం బ్లూటూత్ ఐడెంటిఫైయర్స్ తప్ప ఎటువంటి సమాచారం ప్రభుత్వ వైద్య యంత్రాంగానికి తమ సిస్టం అందించదని తెలిపింది. ఒకవేళ కోవిడ్ 19 బాధితుల వద్దకు తమ వినియోగదారులు వస్తే తమ టెక్నాలజీ వెంటనే నోటిఫికేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుందని యాపిల్ గూగుల్ సంస్థ నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: