టిక్ టాక్ ఇప్పుడు చిన్న పిల్లలతో మొదలుకొని, పండు ముసలి వాళ్లు వరకు  వాళ్ల ప్రతిభ చూపించుకోవడానికి ఇప్పుడు  దీనిని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా అవకాశాలను పొందిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లను చూసి  మరికొందరు సినీ ఆర్టిస్ట్ లుగా ఎదగాలని వాళ్లలో ఉన్న ప్రతిభను నలుగురికీ తెలిసే విధంగా వీడియో చిత్రీకరించి టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ విధంగా వారికి అవకాశాలు వస్తాయేమో అని ఆశతో ఎదురుచూస్తున్నారు.


టిక్ ‌టాక్ ‌కు పోటీగా వ‌చ్చిన మిట్రాన్ ఎన్నో రోజులు నిల‌బ‌డ‌లేదు. డౌన్‌లోడ్ల‌తో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గ‌తంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఇండియ‌న్ యాప్ టిక్‌టాక్ ‌కు పోటీగా దిగింది. ప్ర‌స్తుతం "చింగారి" యాప్ మార్కెట్లో సెన్సేష‌న్‌గా మారింది. పైగా "బైకాట్ చైనా ప్రొడ‌క్ట్స్" నినాదం త‌ర్వాత ఈ యాప్‌కు మ‌రింత ప్రాచుర్యం ల‌భించింది. గ‌డిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 ల‌క్ష‌ల మంది డౌన్‌ లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో "చింగారి" ట్రెండింగ్‌లో నిలిచింది. చింగారి స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిశ్వాత్మ నాయ‌క్ మాట్లాడుతూ... "భార‌తీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయం వెతుకుతున్నారు. అయితే మేము అందరి అంచ‌నాల‌కు మించి దీన్ని రూపొందించాం.

 

 

ఈ యాప్ ‌ను వాడుతున్న వినియోగ‌దారులు సంతోషం వ్య‌క్తం చేయ‌డం సంతృప్తినిస్తోంద‌ని తెలిపారు. కాగా ఈ ఆడియో వీడియో ప్లాట్‌ఫామ్‌ ను 2019లోనే డెవ‌ల‌ప్ చేశారు. ఇందులో కొత్త వ్య‌క్తుల‌తో చాట్ చేయ‌వ‌చ్చు, వీడియోలు అప్‌ లోడ్ చేయ‌వ‌చ్చు. వినియోగ‌దారులే స్వంతంగా వాట్సాప్ స్టేట‌స్‌లు, వీడియోలు, ఆడియోలు కూడా రూపొందించ‌వ‌చ్చు. మ‌రో ముఖ్య విష‌య‌మేంటంటే ఇందులో ఎవ‌రి వీడియోలు వైర‌ల్ అవుతాయో వారికి పాయింట్లు ల‌భిస్తాయి. దీన్ని డ‌బ్బులుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ యాప్ ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మ‌రాఠి, బంగ్లా, పంజాబీ, క‌న్న‌డ‌, తమిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం, మీరూ ఓ సారి చింగారి యాప్ ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: