గేమింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అసుల్ రోగ్ 3 స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేసింది. తైవాన్ టెక్నాలజీ దిగ్గజం ఆసుస్.. త‌న సరికొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అసుల్ రోగ్ 3ను భార‌త్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. గేమింగ్ ప్రియుల కోసం వైవిధ్యమైన ఫీచర్లు ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ ఇందులో ఉంది. ఈ అసుల్ రోగ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అసుస్ రోగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్స్ విష‌యానికి వ‌స్తే.. 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అసుల్ ఇందులో అందించింది.

 

12 జీబీ ర్యామ్..  256 జీబీ స్టోరేజ్ అందించారు.  ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరా విష‌యానికి వ‌స్తే.. రోగ్ ఫోన్ 3 వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం 24 మెగా పిక్సెల్ ఫ్రెంట్‌ కెమెరాను అందించారు. 

 

6000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీతో పాటు హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. అలాగే ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.47,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999గా నిర్ణ‌యించింది అసుస్‌. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాగా, లెనోవో లీజియన్ ఫోన్ డ్యూయల్ స్మార్ట్ ఫోన్ కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంద‌ని ప‌లువువు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: