ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను కంపెనీ లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసినదే. ఈ సిరీస్ ‌లో మొత్తం నాలుగు ఫోన్లు కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఆపిల్ ఐఫోన్‌ 12, 12 ప్రో కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఇలా కొనుగోలు చేస్తే మరెంత సేవ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే... కొత్తగా భారత్‌ మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్‌ 12, 12 ప్రో మొబైళ్ల ప్రీ బుకింగ్ ‌పై సంగీత మొబైల్స్‌ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మీరు కనుక హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రిడెట్‌ కార్డు మీద  ఐఫోన్‌ 12, 12 ప్రో ని కొనుగోలు చేస్తే ఈ  మొబైళ్లపై రూ.6 వేల క్యాష్‌బ్యాక్ అలానే  6 నెలల పాటు వడ్డీలేని వాయిదాలను చెల్లించవచ్చు.

ఒకవేళ కార్డు లేకపోతే కార్డు  ఫోన్‌ ఎక్స్జేంజ్ చేస్తే దాని ప్రస్తుత విలువతో పాటు మరో రూ.ఆరు వేలు అదనంగా చెల్లించనున్నారు. చూసారా ఏం బంపర్ ఆఫర్..! అంతే కాదండి ప్రీబుక్‌ చేసే తొలి 1000 మంది కస్టమర్లకు సంస్థ నుంచి ఒక గోల్డ్ ‌కాయిన్‌ బహుమతిగా అందుతుంది. జీఎస్‌టీఐఎన్‌ నంబర్‌ ఉన్న వారు ఐ ఫోన్లను కొంటే 18శాతం జీఎస్‌టీ రీఫండ్‌ అవుతుంది. ఇక్కడ కొంటే ఆపిల్‌ కేర్‌ మీద 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తుంది.

దసరా పండుగ కారణం గానే ఇతర మొబైల్‌ బ్రాండ్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల పై అతి తక్కువ ధరకు, విన్నూత ఆఫర్ల తో కస్టమర్లకు అందిస్తున్నాం మేము అని ఎండీ సుభాష్‌ చంద్ర తెలిపారు.  చూసారా ఈ ఆఫర్లని మరి మీరు కూడా ఇలా కొనుగోలు చేసేసి ఇప్పుడు మీ డబ్బుని సేవ్ చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: