మ్యూజిక్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఇక మీదట మీ చేతిన వాచ్ ఉంటే చాలు. ఎంచక్కా మీకు ఇష్టమైన పాటలు వినొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా.. !! అసలు వివరాలలోకి వెళితే  యాపిల్ వాచ్ లలో పాటలను వినడానికి ఇకపై యాపిల్ ఫోన్ లను తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. జాగింగ్ చేస్తున్న సమాయంలోనూ, జిమ్ లలోనూ యాపిల్ వాచ్ తోనే మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే ఇక మీదట  ఐఫోన్ అవసరమే లేకుండా యాపిల్ వాచ్ యూజర్లు డైరెక్ట్ గా స్పాటిఫై నుండి పాటలను వినొచ్చు. అయితే ఇప్పటివరకు ఐఫోన్ కు వాచ్ కనెక్ట్ చేసి పాటలు వింటున్నాము. కానీ ఇకమీదట ఐఫోన్ కు వాచ్ ను కనెక్ట్ చేయకుండానే పాటలు వినొచ్చని ఐఫోన్, స్పాటిఫై సంస్థలు ధృవీకరించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన  మ్యూజిక్ యాప్ ను సెప్టెంబర్ నుండి టెస్ట్ చేస్తూ ఉన్నారు.  ప్రస్తుతం అందరు యూజర్లు వాడవచ్చని చెబుతూ ఉన్నారు. స్పాటిఫై యాప్ ను ఎక్కడైనా ఎపుడైనా వినే వెసులుబాటు కల్పించాలని అనుకుంటూ ఉన్నామని స్పాటిఫై సంస్థ తెలిపింది. 





డివైజ్, ప్లాట్ ఫామ్ తో సంబంధం లేకుండా అందరికి  అందించాలని అనుకుంటూ ఉన్నామని స్పాటిఫై సంస్థ చెబుతోంది. ప్రస్తుతం స్పాటిఫై ను యాపిల్ వాచ్ లో మాత్రమే  ఎంజాయ్ చేయవచ్చని తెలిపింది. కానీ ఈ వెసులుబాటు కేవలం ఆన్లైన్ లోనున్నపుడు మాత్రమే ఉంటుంది. ఇంకా ఆఫ్ లైన్ లో వాడే అవకాశం ఇంకా రాలేదు. 




ఇప్పటికే కొన్ని యాపిల్ ఫోన్లలోకి స్పాటిఫై స్ట్రీమింగ్ ఫీచర్ వచ్చేసింది, ఇంకొద్ది రోజుల్లో మిగిలిన యాపిల్ ఫోన్స్ లోకి రానుంది. వైఫై లేదా సెల్యులార్ నెట్ వర్క్ సహాయంతో స్పాటిఫై ప్లే లిస్టును వాడొచ్చు.అంతేకాకుండా  ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ సహాయంతో పాటలను వినవచ్చు. మరి ఈ కొత్త ఫీచర్ ను అందరు ఉపయోగించుకుని ఎంజాయ్ చేయండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: