డాల్బీ విజన్ సపోర్ట్‌ను కూడా ఇందులో షియోమీ అందించనుంది. దీంతోపాటు ఇందులో హెచ్‌డీఆర్10+ ఫీచర్ కూడా ఉండనుంది..ఈ టీవీని మార్చి 17 న మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. గత నెలలో ఫిబ్రవరిలో లాంచ్ అయిన రెడ్ మీ మ్యాక్స్ టీవీనే రెడ్ మీ టీవీ ఎక్స్ఎల్‌గా లాంచ్ చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమైతే మాత్రం 4కే రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ టీవీ ధర మనదేశ కరెన్సీలో సుమారు రూ.91,400 నిర్ణయించారు.
86 అంగుళాల 4కే ఎల్ఈడీ బ్యాక్‌లైట్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉండనుంది. 10-బిట్ కలర్, హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+, హెచ్ఎల్‌జీ, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఎంఈఎంసీ చిప్‌ను అందించారు.ఇందుల్ క్వాడ్ కోర్ సీపీయూను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు బిల్డ్ ఇన్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 12.5W సౌండ్ అవుట్ పుట్‌ను అందిస్తాయి. అంటే మొత్తంగా 25W సౌండ్ అవుట్ పుట్ అని చెప్పాలి. మొత్తానికి ఈ టీవీ మాత్రం మార్కెట్ లో డిమాండ్ మాములుగా ఉండదని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి