ప్రపంచంలో అందరికీ అవసరమైన, అందుబాటులో వుండే వాహనం టూ- వీలర్. కానీ ఇప్పుడు అవి భారీ స్థాయిలో ఎక్కువ ధర కు చేరుకున్నాయి. మరి  ఇప్పుడు ఇంకా ఏప్రిల్-1 నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా పెరగనున్నాయి అనీ ప్రముఖ దిగ్గజ సంస్థ హీరో మోటోకార్స్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. ఒక్కో టు వీలర్ పై రూ.2,500 వరకు పెంచుతున్నట్లు హీరో మోటార్స్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికి కంపెనీ షేర్లు 0.83 % అమాంతం పతనానికి కావడం గమనార్హం.


అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్ , కాపర్ ,క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో వాహన ధరలు పెంచక తప్పడం లేదని సంస్థ ప్రకటించింది. అయితే ఈ పెరిగిన ధరలు వినియోగదారుల పై పూర్తి భారం పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను, ఇప్పటికే ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. దిగ్గజ సంస్థ అయినటువంటి హీరో ధరలను పెంచుతూ చేసిన ప్రకటన , ఇది విన్న మిగతా కంపెనీలు కూడా అదే బాటలో ధరలు పెంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.


ఇక పెంచిన ధరలు అన్ని బైకులకు వర్తించదు. మోడల్ ను బట్టి, బైక్ ను బట్టి ఉంటుందని, అది వినియోగదారుడు ఎంచుకునే మోడల్ను బట్టి పెంచిన ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని సంస్థ ప్రకటించింది. కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ పోతుండడంతో పాటు గత అక్టోబర్ నుంచి ప్రజారవాణా, పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బైక్ కొనుగోలు చేసే వారి సంఖ్య తక్కువగా ఉంది.  దీంతో సేల్స్ అన్ని పడిపోయాయి. అంతేకాకుండా ఖర్చు కూడా భారీగా పెరగడంతో హీరో మోటో కార్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా ఈ పెంచిన ధరలు స్కూటీ లపై కూడా అమల్లోకి రానున్నట్లు తెలిపింది.అయితే ఇప్పటికే మారుతి సుజుకి  తయారీ సంస్థ  కూడా తయారు చేసే వాహన ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: