ఇప్పుడున్న ప్రపంచంలో టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఏ అవసరం కావాలన్నా, ఏదైనా విషయం గురించి తెలియాలి అన్నా , బ్యాంకింగ్ వివరాలు కావాలన్నా ముందుగా వెతికేది మనం గూగుల్ లోనే . అంతలా మనం గూగుల్ కి అలవాటు పడిపోయాం. అయితే గూగుల్ సెర్చ్ లో దొరికే సమాచారం అంతా నిజమేనా!!అంటే కాదని చెప్పాలి.అయితే కొన్ని విషయాలు గూగుల్ లో వెతికితే పర్లేదు. కానీ బ్యాంకింగ్ కస్టమర్ కేర్ నెంబర్ లు వంటి కొన్ని వివరాలను గూగుల్ సర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలట. గూగుల్లో ఏటువంటివి సెర్చ్ చేయకూడదో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
కస్టమర్ కేర్ నెంబర్:
మనము ఏదైనా నెంబర్ కి ఫిర్యాదు చేయాలన్నా ఆ కంపెనీకి సంబంధించిన కస్టమర్ నెంబర్ కోసం గూగుల్లో వెతుకుతూఉంటాం. అలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతారు. ఎందుకంటే ఆ నకిలీ నెంబర్లతో వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ వెబ్ సైట్లు:
చాలా మంది వెబ్సైట్ లో యుఆర్ఎల్ ను గూగుల్ లో వెతుకుతుంటారు. ఇలా యూఆర్ఎల్ వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గూగుల్ లో నకిలీ ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్లు చాలానే ఉంటాయి. నకిలీ వెబ్ సైట్ ద్వారా ఈ డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
ప్రభుత్వ వెబ్ సైట్:
బ్యాంకింగ్ వెబ్సైట్ లు సైబర్ మోసగాళ్ళుకు ప్రధాన కార్య ప్రభుత్వ వెబ్ సైట్ గా చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు, రిజిస్ట్రేషన్లు సమాచారం కోసం ప్రభుత్వ వెబ్ సైట్ లింక్ లను గూగుల్ లో అసలు వెతక వద్దు. యు ఆర్ ఎల్ ను కచ్చితంగా తెలుసుకొని ఓపెన్ చేయాలి.
సోషల్ మీడియా వెబ్ సైట్లు:
సోషల్ మీడియా వెబ్ సైట్ లో వివరాలు కూడా గూగుల్ లో పెట్టకూడదు. పొరపాటున నకిలీ వెబ్సైట్లో లాగిన్ అయితే మన వ్యక్తిగత వివరాలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.
వ్యక్తిగత వివరాలు:
కొంతమంది అత్యుత్సాహంతో తమ పేరు ,ఫోన్ నెంబర్ ,అడ్రస్ ,మెయిల్ ఐడి వంటి వ్యక్తిగత వివరాలను గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ఇలా సెర్చ్ చేసిన ప్రతి విషయాన్ని గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. ఇలా సైబర్ నేరగాళ్ళ భారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
యాప్ లు.. సాఫ్టు వేర్:
ఏదైనా యాప్ లేదా సాఫ్ట్వేర్ కావాలంటే చాలామంది గూగుల్ లో వెతికి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. కానీ అది సురక్షితం కాదు. వీటి వల్ల మనం వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది.
ఇలాంటివన్నీ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి