మనం ఎంత పెద్ద వ్యాపారం చేసినా అది సక్సెస్ కావాలంటే ముందుగా అందరి నోట పిలవ గలిగే పేరు, మరియు ఆకర్షణీయమైన లోగో ఎంతో అవసరం. లోగో లు చేయడం అంత సులువైన విషయమేం కాదు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీల లోగోల వెనుక ఎన్నో సీక్రెట్ దాగి ఉన్నాయి .అవేంటో చూద్దా

Dell:
అమెరికాకు చెందిన ఈ కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ లోగో ని చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. డెల్ అనే అక్షరం లో ఈ అనే అక్షరం డీ అనే అక్షరం మీదకు వాలిపోయి ఉంటుంది. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ కష్టపడి అలా నీరసించి పోతారనే జోకులు నెట్లో కనబడుతుంటాయి. కాని దాని అసలు ఉద్దేశం వేరు. ఈ కంపెనీని స్థాపించిన వ్యక్తి "మైకెల్ డెల్". తాను స్థాపించిన కంపెనీ ప్రపంచ టెక్నాలజీని చరిత్రలోనే తిరగరాయాలన్న ఉద్దేశంతో ఈ అక్షరాలు అన్నీ చెప్పాడు. ఇందులో ఈ అనే అక్షరం ఇయర్ (చెవి) అని అర్థమట. అతని ఉద్దేశ్యం ఏంటంటే 'టర్న్ ద వరల్డ్ ఆన్ విచ్ ఇయర్' అని.
Hyundai: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హుందయ్ లోగోను గమనించారా ? హెచ్ అనే అక్షరం కాస్త వంగి ఉంటుంది. అయితే ఇద్దరు వ్యక్తులు షేక్హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్లు కనపడుతుంది. అంటే కస్టమర్లతో మెలగాల్సిన విధానం వారి సింబల్స్ లోనే చూపిస్తుందని కంపెనీ చెబుతోంది.
Toyoto:
ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలలో టయోటో లోగో చూస్తే ఒక వృత్తంలో మరో రెండు వృత్తాలు కలిగి ఉండి, అందులో టి అనే అక్షరం కలిగి ఉంటాయి. అయితే ఇందులో(toyoto) కంపెనీ పేర్ల అన్ని అక్షరాలు ఉంటాయి.

Apple:
ప్రముఖ సాఫ్ట్వేర్, హార్డ్ వేర్ కంపెనీ ఆపిల్ లో లోగో ను ఎప్పుడైనా గమనించారా ? అందులో కొంచెం కొరికిన యాపిల్ ఉంటుంది. బైబిల్లోని ఆడమ్, ఈ మధ్య జరిగిన ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కి ఇది గుర్తు. యాపిల్ తిన్న తర్వాతే మనుషులకు జ్ఞానం వచ్చిందని బైబిలు చెబుతోంది. అందుకే ఆపిల్ని గుర్తుగా పెట్టుకున్నారు.

Audi:
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఆడి. లగ్జరీ కార్ల లో అత్యంత ఆదరణ పొందిన కార్ బ్రాండ్ ఆడి. ఆడి కార్ లోగో వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. ఆడి కారు ఉత్పత్తి చేయడానికి 1932 లో డీకే డబ్ల్యూ, హర్ష, వండర్, ఆడి అనే నాలుగు ఆటోమొబైల్ కంపెనీలు కలిసి ఆటో యూనియన్ గా ఏర్పడ్డాయి . ఆ నాలుగు కంపెనీల గుర్తుగా నాలుగు సర్కిల్స్ ను వాడి తయారు చేశారు.

Voltes wagen:
జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా తమ కార్లను విక్రయిస్తోంది. ఈ లోగోలో v,w అక్షరాలు ఒక వృత్తంలో ఒకదాని కింద మరొకటి చేర్చి ఉంటాయి. దీనిలో వి అంటే ఓల్ట్స్ . దీనికి జర్మనీలో ప్రజలు అని అర్థం. అలాగే డబ్ల్యు.. వేగం అంటే కారు అని అర్థం. అంటే పూర్తిగా ప్రజల కారు అని అర్థం వచ్చేలా ఈ లోగోను క్రియేట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి