ఈ- కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ జూలై - 26..ఈరోజు రాత్రి 12:00 నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021ను ప్రారంభించనుంది. ఈ ప్రైమ్ డే సేల్ లో దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీ లు అతి తక్కువ ధరకే మొబైల్స్ ను అందించనున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్, ఆపిల్, షియోమీ, రెడ్ మీ , రియల్ మీ వంటి ఇతర స్మార్ట్ఫోన్లు బ్రాండ్ ఫోన్స్ ను కూడా మనకు భారీ తగ్గింపుతో అందించడానికి అమెజాన్ ముందుకు వచ్చింది. అయితే ఏ మొబైల్స్ పై ధరలు తగ్గుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆపిల్ ఐఫోన్ 11:పోయిన సంవత్సరం అమెజాన్ బ్లాక్ షిప్ సేల్ పేరిట జరిపిన సేల్ లో  దీనిని 54,900 రూపాయలుగా నిర్ణయించారు.కానీ ఇప్పుడు రూ 47,999 రూపాయలకు అందిస్తున్నారు. ఇందులో 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా కలిగిన హెచ్ డి ,ఎల్ సి డి తో  డిస్ప్లే తోపాటు డ్యూయల్ కెమెరా సెటప్ కూడా కల్పించబడింది.

2. వన్ ప్లస్ 9:ఇక ఈ మోడల్ పై మొట్టమొదటిసారిగా డిస్కౌంట్ లభిస్తోంది. దీనిపై ఏకంగా నాలుగు వేల రూపాయలను తగ్గించినట్లు సమాచారం. ఇందులో 4500 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ కూడా కలదు. ఇక 125 రిఫ్రెష్ రేట్ తో పాటు 6.5 ఇంచ్ డిస్ప్లే కూడా అమర్చబడింది.

3. రియల్ మీ సి 1:దీని ధర లాంఛ్ చేసినప్పుడు 6,999 రూపాయలు ఉండగా, దానిని ఇప్పుడు 6,699 రూపాయలకు ఇవ్వనున్నారు. ఇక ఇందులో 6.5 ఇంచుల ఎల్ఇడి డిస్ప్లే తో పాటు 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది. అంతేకాదు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

4. షియోమీ 11X5 జీ:దీని ధర మార్కెట్ లో రూ.33,999 రూపాయలు ఉంది. అయితే దీనిపై రూ.6000 తగ్గింపుతో రూ.27,999 కే లభించనుంది. ఇది 6.67 ఇంచుల హెచ్డి డిస్ప్లే కూడా కలదు.



మరింత సమాచారం తెలుసుకోండి: