సాధారణంగా మొదట్లో మనం మనీ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లేవాళ్లం.. కానీ రాను రాను ఏటీఎం వంటి సదుపాయాలను కలిపించాయి ప్రభుత్వాలు..ఇక ఇప్పుడు మరో సరికొత్త టెక్నాలజీతో గూగుల్ పే, ఫోన్ పే.. వంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లతో సరికొత్తగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి. అయితే తాజాగా ఎన్.సీ.ఆర్ .కార్పొరేషన్ సంస్థ కేవలం యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం లలో ఉండే డబ్బులను విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం గమనార్హం. ఇక వినియోగదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని , కొన్ని బ్యాంకులు.. తమ బ్యాంకు యాప్ లలో కార్డ్ లెస్ విత్డ్రా పేరుతో ఒక ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

డబ్బులు డ్రా చేసుకోవాలి అంటే.. సదరు బ్యాంక్ ఏటిఎం లలో మాత్రమే యూజర్లు డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎంలలో కార్డు లేకుండా చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని ఏటీఎం తయారీ సంస్థలు అయినటువంటి ఎంసీఆర్ కార్పొరేషన్.. వినియోగదారుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని, సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. టెక్నాలజీ సహాయంతో మీరు ఎటువంటి ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు  విత్ డ్రా చేయవచ్చు.


ముఖ్యంగా మీరు ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకోవాలంటే యూపీఐ యాప్ కంపల్సరి గా ఉండాలి. యూపీఐ  యాప్ సహాయంతో మీరు యూపీఐ ఆప్ ను ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఇందుకోసం ఏటీఎంలో క్యూఆర్ కోడ్ ను మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ కోడ్ స్కానింగ్ చేసి అవసరమైన అమౌంటు ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ విధానం ద్వారా కేవలం ఐదు వేల రూపాయల వరకు మాత్రమే విత్డ్రా చేసుకోగలరు.కాబట్టి ఇకమీదట మీరు ఏటీఎమ్ లకు వెళ్తే మొబైల్ లో వుండే యుపీఐ యాప్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: