ప్రస్తుతం యువతకు ప్రతి ఒక్కరికి కి ఫేస్ బుక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉన్నది. అయితే ఈ అకౌంట్ లు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సృష్టించి నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది ముఖ్యంగా నకిలీ అకౌంట్ ల తో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతూ.. యాక్సెప్ట్ చేసిన తర్వాత అత్యవసరంగా డబ్బు కావాలి అని అడుగుతూ ఉంటారు.


అయితే వారు చెప్పేది నిజమే అనుకొని ఎంతోమంది ఇలా మోసపోతు డబ్బులు పంపిస్తారు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. పోలీసులకు ఫిర్యాదులు వీటిపైనే ఎక్కువగా ఉండడంతో వీటి పైన నిఘా ఉంచారు పోలీసులు. అయితే ఇలాంటి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ను గుర్తించినప్పుడు వీటిని డిలీట్ చేసుకునే సదుపాయం కూడా కలదు. ఇప్పుడు వాటి గురించి మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1). మీ పేరు పైన నకిలీ ఖాతా ఉన్నట్లు అయితే అకౌంట్ ని తొలగించుకోవచ్చు.. ఇలా డిలీట్ చేయాలంటే ముందుగా అకౌంట్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది.

2). అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఫోటో కింద కుడివైపున మూడు చుక్కల మీద క్లిక్ చేయవలసి ఉంటుంది.

3). ఆ తరువాత ఫైండ్ సపోర్ట్ or రిపోర్ట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ను ఎంపిక చేయాలి.

4). అక్కడ ఎందుకు రిపోర్టు చేస్తున్నారో వాటి గురించి కొన్ని కారణాలను తెలుపవలసి ఉంటుంది.


5) . ఫేస్ బుక్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ రిపోర్ట్ ప్రక్రియను పూర్తి చేయాలి.

6). మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు కూడా ఇదే విధంగా ఆ అకౌంట్ పై రిపోర్టు చేయించాలి. అప్పుడు మీ ఫేస్ బుక్ పరిశీలిస్తే నకిలీ ఖాతా ఉన్నట్లు అయితే డిలీట్ చేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: