
ఐక్యూ 12-5G స్మార్ట్ మొబైల్ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది అంటూ అమెజాన్ లో టీజర్ విడుదల కావడం జరిగింది. ఈ స్మార్ట్ మొబైల్ లాంచ్ కోసం ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజీని కూడా అమెజాన్ విడుదల చేయడం జరుగుతోంది. ఐక్యూ 12 స్మార్ట్ మొబైల్ 5g స్మార్ట్ మొబైల్ నుండి విడుదల కాబోతోంది. ఈ మొబైల్ ఫీచర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా సూచిస్తుంది. ఈ మొబైల్ అచ్చం చైనాలో ఎలా విడుదల అయ్యిందో అలాగే లేకపోతే కొన్ని మార్పులు చేసి ఉండవచ్చని తెలుస్తోంది.
IQOO -12..5G:
ఈ మొబైల్ చైనా మార్కెట్లో విడుదలైన ప్రకారం..6.78 అంగుళాల అమౌంట్ డిస్ప్లే కలిగి ఉంటుంది..HDR సపోర్టు కూడా కలిగి ఉంటుందట ఎయిత్ జనరేషన్తో ఫాస్ట్ ప్రాసెసింగ్ కలిగి ఉంటుంది..12/256GB..16/512 GB స్టోరేజ్ అనే రెండు వేరియేషన్ లో కలదు..5000 MAH బ్యాటరీ సామర్థ్యం తో కలిగి ఉండడమే కాకుండా..120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా కలిగి ఉంటుంది.. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు..64 mp పెరిస్కోప్ కెమెరా తో మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 8K వీడియోలను చిత్రీకరించవచ్చు. అయితే ధర విషయంలో ఇంకా ఎటువంటి ధరను ఇంకా ప్రకటించలేదు కానీ చౌక ధరకే ఈ మొబైల్ లభిస్తుందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి